టీమిండియా ఓడిపోతామనే భయంతోనే పాకిస్తాన్తో సిరీస్ ఆడేందుకు ఇష్టపడడం లేదని పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ అన్నాడు. ‘ఇండియా- పాకిస్తాన్ జట్ల మధ్య మంచి గౌరవం, స్నేహం గతంలో ఉండేవి.. కానీ ఇప్పుడున్న టీముల్లో భారత జట్టు ఒక్కటే, పాకిస్తాన్తో సిరీస్లు ఆడడం లేదు.. వాళ్లు ఎందుకు ఆడడం లేదో తెలుసా.. పాక్ జట్టు పటిష్టంగా ఉంది.. ఒకవేళ ఆడితే ఓడిపోతామనే భయంతోనే మ్యాచ్ లు ఆడటం లేదని రజాక్ చెప్పాడు.
గూఢచర్యం ఆరోపణలపై విదేశాంగ మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న వ్యక్తిని ఘజియాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల ప్రకారం, పోలీసులు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి సమాచారం అందుకున్న తర్వాత నవీన్ పాల్ అనే వ్యక్తిని క్రాసింగ్స్ రిపబ్లిక్ ప్రాంతం నుంచి పట్టుకున్నారు.
పాకిస్థాన్లో ఎడతెరపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రధాన నగరాలు నీట మునుగుతున్నాయి. జూన్ 25 నుంచి కురుస్తున్న రుతుపవన వర్షాల కారణంగా దాదాపు 86 మంది మరణించగా.. 151 మంది గాయపడినట్లు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ఎన్డీఎంఏ) నివేదించింది.
Former India captain Sourav Ganguly Picks 5 Semi-Finals Teams for World Cup 2023: భారత గడ్డపై అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ 2023 జరగనున్న విషయం తెలిసిందే. సొంత గడ్డపై మ్యాచ్లు జరగనున్న నేపథ్యంలో టీమిండియా ఫెవరేట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. భారత్తో పాటుగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ కూడా పటిష్టంగా ఉన్నాయి. మెగా టోర్నీలో సెమీస్ చేరే జట్లేవో అని మాజీలు తమ అభిప్రాయాలు చెపుతున్నారు.…
PUBG Love Story: పబ్జీ లవ్ స్టోరీ దేశవ్యాప్తంగా వైరల్ గా మారిన సంతతి తెలిసిందే. పాకిస్తాన్ కి చెందిన మహిళ, ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన వ్యక్తితో ప్రేమలో పడింది. కరోనా సమయంలో పబ్జీ గేమ్ ద్వారా ఇద్దరూ మొదటగా పరిచయమయ్యారు. ఆ తరువాత వీరిద్దరు ప్రేమలో పడ్డారు. తన ప్రియుడిని కలుసుకునేందుకు ఆమె భారతదేశానికి వచ్చింది. అప్పటికే పెళ్లై నలుగురు పిల్లలు ఉన్న సీమా హైదర్ సౌదీ అరేబియా, నేపాల్ మీదుగా ఇండియా చేరింది.…
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్ సర్గోధా జిల్లాలో శనివారం ప్యాసింజర్ వ్యాన్లోని గ్యాస్ సిలిండర్ పేలింది. గ్యాస్ సిలిండర్ పేలడంతో కనీసం ఏడుగురు మరణించారు. 14 మంది గాయపడ్డారు.
Pakistan: భారతదేశానికి ధీటుగా మా ఆర్మీ ఉంది, ఎప్పుడైనా కాశ్మీర్ ను రక్షించుకుంటాం అంటూ ప్రగల్భాలు పలికే పాకిస్తాన్ ఇప్పుడు ఆ దేశ సైన్యానికి తిండి పెట్టే పరిస్థితుల్లో కూడా లేదు. చివరకు పాకిస్తాన్ ఆర్మీ తీవ్ర ఇంధన సంక్షోభాన్ని చవిచూస్తోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ కూడా తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది.
గత నెల నుంచి పాకిస్తాన్లో కురుస్తున్న రుతుపవనాల వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఎనిమిది మంది చిన్నారులతో సహా కనీసం 50 మంది మరణించారని అధికారులు శుక్రవారం తెలిపారు.
భారత్ లో జరుగనున్న వన్డే వరల్డ్ కప్ లో ఉత్కంఠభరితమైన మ్యాచ్ ఏదైన ఉందంటే అది ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ మాత్రమే అని ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు చెబుతారు. ఎందుకంటే దాయాది దేశంపై ఇప్పటి వరకు మనకు మంచి ట్రాక్ రికార్డ్ ఉందనే చెప్పాలి. అయితే ఈ వరల్డ్ కప్ లో జరిగే మ్యాచ్ పై పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజాంను అక్కడి మీడియా ప్రశ్నించింది. దీనిపై అతడు రియాక్ట్ అవుతూ.. అవును.. భారత్తో మ్యాచ్ ఉంది..…
History of India vs Pakistan in ODI World Cup: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు మ్యాచ్లు జరుగుతాయి. రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరగనున్న మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. 48 మ్యాచ్లకు భారత్లోని 10 నగరాలు ఆతిథ్యమివ్వనున్నాయి. అక్టోబరు 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్తో భారత్ తన ప్రపంచకప్ పోరాటాన్ని ప్రారంభిస్తుంది. ఇక ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా…