Pakistan: పాకిస్తాన్ పీకల్లోతు ఆర్థిక కష్టాలతో సతమతం అవుతోంది. ఆల్ టైం గరిష్టానికి చేరుకుంది. నిత్యవసరాల ధరలు చుక్కల్ని అంటుతున్నాయి. మరోవైపు కరెంట్ ఛార్జీలు, కరెంట్ కోతులు, గ్యాస్ ఛార్జీలు, పెట్రోల్ ఛార్జీలు విపరీతంగా పెరగడంతో పాకిస్తాన్ జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా కరెంట్ ఛార్జీల భారీగా వస్తుండటంతో జనాలు వీటిని కట్టవద్దని నిరసన తెలుపుతున్నారు.
Read Also: Rakul Preet Singh Pics: రెడ్ డ్రెస్‌లో హాట్ మిర్చిలా రకుల్ ప్రీత్ సింగ్.. కుర్రాళ్ల చూపంతా అక్కడే!
ఇదిలా ఉంటే పాకిస్తాన వ్యాప్తంగా గోధుమ పిండి కష్టాలు వెన్నాడుతూనే ఉన్నాయి. తాజాగా ఓ టీనేజ్ బాలుడు ఒక దుకాణంలో పిండిని దొంగిలించడంతో సాదిక్ అనే దుకాణదారు ఆ పిల్లాడిని కట్టేసి కొట్టని వీడియో అక్కడ వైరల్ గా మారింది. మియాన్ చన్నూలోని బోరా చౌక్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై అక్కడి ప్రజలు తీవ్ర ఘటన వ్యక్తం అవుతోంది. చిత్రహింసల ఘటనపై స్థానిక అధికారులు ఏం చేయడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజల నుంచి తీవ్ర నిరసన రావడంతో పోలీసులు సదరు నిందితుడిని అరెస్ట్ చేశారు.