తాజాగా ప్రపంచకప్ కోసం తమ జట్టును భారత్‌కు పంపేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతి ఇచ్చింది. దీంతో వన్డే ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరిగే పోరును ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు మరోసారి వీక్షించనున్నారు. అంతేకాదు 7 ఏళ్ల నిరీక్షణ తర్వాత మళ్లీ పాక్ జట్టు భారత్‌కు రానుంది.
పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హజారా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 40 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు.
రాజస్థాన్‌లోని భివాడి నుంచి తన ఫేస్బుక్ ప్రేమికుడి కోసం పాకిస్థాన్‌కు చేరుకున్న అంజు.. మరోసారి వార్తల్లోని హెడ్‌లైన్స్‌లో కొనసాగుతోంది. అంజును పాకిస్థాన్‌కు తీసుకెళ్లేందుకు ప్రేరేపించారని ఆమె భర్త అరవింద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దాయాది దేశం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఆదాయం కోసం ప్రజలపైనే భారం వేసేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధపడింది పాకిస్తాన్లో ఇంధనం, ఆహార ధరలలో పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం 1.30 పెరిగింది. వార్షిక ద్రవ్యోల్బణం 29.83 శాతానికి పెరిగిపోయింది.
Toshakhana case: తోషాఖానా కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దోషిగా తేలింది. కోర్టు అతనికి మూడేళ్ల శిక్ష విధించింది. శిక్ష పడిన తర్వాత ఇమ్రాన్ వచ్చే ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయలేరు.
ఇండియా వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ లో మార్పులు జరిగాయి. అక్టోబర్ 15న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరగాల్సి ఉండగా.. ఒక్కరోజు ముందుగానే అక్టోబర్ 14న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది.
Pakistan Blast: పాకిస్థాన్‌లో ఉగ్రవాద ఘటనలు తగ్గుముఖం పట్టడం లేదు. తాజాగా ఆదివారం (జూలై 30) భారీ పేలుడు సంభవించింది. పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రాంతంలోని బజౌర్ లో జరిగిన ఈ బాంబు పేలుడులో 40 మంది మరణించారు, 200మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.