Delhi: “మీరెందుకు పాకిస్తాన్ వెళ్లలేదు”.. విద్యార్థులపై టీచర్ మతపరమైన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్‌లో ఓ స్కూళ్లో టీచర్ ఆదేశించడంతో ముస్లిం విద్యార్థిని, మరికొందరు విద్యార్థులు చెంపపై కొట్టడం దేశవ్యాప్తంగా వైరల్ అయింది. త్రిప్తా త్యాగి అనే ఉపాధ్యాయురాలు చేసిన ఈ పనిపై విమర్శలు వెళ్లువెత్తాయి. అయితే ఈ చర్యలో ఎలాంటి మతపరమైన విద్వేషం లేని సదరు ఉపాధ్యాయురాలు చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే ఢిల్లీలోని ఓ పాఠశాలలో ఓ టీచర్ మతపరమైన వ్యాఖ్యలు చేసిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నలుగురు విద్యార్థులను ఉద్దేశిస్తూ.. దేశ విభజన సమయంలో పాకిస్తాన్ ఎందుకు వెళ్లలేదు..? అని టీచర్ ప్రశ్నించారు. ఇప్పుడు ఇది వివాదాస్పదం అయింది. ఢిల్లీ గాంధీనగర్ లోని ప్రభుత్వం సర్వోదయ బాల విద్యాలయంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల కుటుంబీకుల ఫిర్యాదు మేరకు హేమా గులాటీ అనే ఉపాధ్యాయురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఆరోపణలపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read
- Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
- UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
Read Also: Kaveri water: కర్ణాటకకు షాక్ .. తమిళనాడుకు రోజూ 5వేల క్యూసెక్కులు
హేమా గులాటి బుధవారం మతపరమైన వ్యాఖ్యలు చేశారు. మక్కాలోని ప్రవిత్రమైన రాతి భవనం కాబాపై, ఖురాన్ పై ఆమె అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విభజన సమయంలో మీరు పాకిస్తాన్ ఎందుకు వెళ్లలేదు, మీరు భారతదేశంలో ఎందుకు ఉన్నారు, భారతదేశ స్వాతంత్య్రంలో మీ సహాకారం లేదని వ్యాఖ్యానించినట్లు ఆరోపించారు.
ఇలాంటి వ్యాఖ్యలు పాఠశాలల్లో విభేదాలకు కారణం అవుతాయని వెంటనే టీచర్ని బర్తరఫ్ చేయాలని విద్యార్థుల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆమెపై చర్యలు తీసుకోకుంటే మరికొందరు ఇలాంటి వ్యాఖ్యలే చేస్తారని సదరు కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆప్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ బాజ్‌పాయ్ టీచర్ తీరును తప్పుపట్టారు. ఇలాంటివి పిల్లల్ని తప్పుదోవ పట్టిస్తాయని, ప్రార్థనా స్థలంపై కించపరిచే వ్యాఖ్యలు చేయకూడదని, అలాంటి వారిని అరెస్ట్ చేయాలని అన్నారు.
తాజావార్తలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
-
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!