ఒక సభ్యుడు ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నంత కాలం భారతదేశం సార్క్ (సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్) సమావేశాన్ని నిర్వహించలేమని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బుధవారం తెలిపారు. రాత్రిపూట ఉగ్రవాదం, పగటిపూట వ్యాపారం జరిగే పరిస్థితిని భారతదేశం సహించదని పాకిస్థాన్‌పై జైశంకర్ మండిపడ్డారు.
Here Is The Scenario If Pakistan Don’t Travel To India For 2023 World Cup: భారత గడ్డపై జరిగే ప్రపంచకప్ 2023 టోర్నీకి పాకిస్థాన్ వస్తుందా? లేదా? అనే సందిగ్థత ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రపంచకప్ 2023కి సంబంధించిన షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో పాకిస్థాన్ జట్టు భారత్‌కి వస్తుందని ఐసీసీ కూడా భావిస్తోంది. అయితే తాము భారత్‌కు వచ్చి ప్రపంచకప్ ఆడాలో వద్దో అనే విషయం పాకిస్థాన్ ప్రభుత్వమే నిర్ణయిస్తుందని పీసీబీ అంటుంది.…
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 9 మందిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటన ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని మలాకాండ్ జిల్లాలో జరిగింది. చనిపోయిన వారిలో నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులు, ఇద్దరు పిల్లలు చనిపోయారు. కాల్పుల్లో 12 ఏళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
Team India Schedule for ICC World Cup 2023 Warm Up Matches: వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబరు 5న మెగా సమరం మొదలయి.. నవంబరు 19న ముగుస్తుంది. ప్రపంచకప్ 2023లోని మొత్తం 48 మ్యాచ్‌లకు భారత్‌లోని 10 నగరాలు ఆతిథ్యమివ్వనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మెగా టోర్నీ మొదటి మ్యాచ్ జరగనుంది. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. చెన్నైలో…
Pakistan will come to India after 7 Years for World Cup 2023: భారత్ ఆతిథ్యమివ్వనున్న వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను మంగళవారం ఐసీసీ విడుదల చేసింది. అహ్మదాబాద్‌లో అక్టోబరు 5న మెగా సమరం ఆరంభం అయి.. నవంబరు 19న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ప్రపంచకప్ 2023లో 45 గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు, 2 నాకౌట్ మ్యాచ్‌లు (సెమీ ఫైనల్స్), ఒక ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం 48 మ్యాచ్‌లకు భారత్‌లోని 10 నగరాలు…
గాడిద చర్మాలు సహా వివిధ వస్తువులను చైనాకు ఎగుమతి చేసే ప్రతిపాదనలకు పాకిస్థాన్ సర్కార్ ఆమోద ముద్ర వేసింది. పాకిస్థాన్ నుంచి పశువులు, పాల ఉత్పత్తులు, మిరపకాయలు, గాడిద చర్మాలను డ్రగన్ కంట్రీకి ఎగుమతి చేసే ప్రతిపాదనలను పాక్ ఫెడరల్ క్యాబినెట్ సర్క్యులేటింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Pakistan: పాకిస్తాన్ దేశంలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల కాలంలో మేకలు, ఇతర పశువుల దొంగతనాలు పెరగుతున్నాయి. ముస్లింలకు పవిత్ర పండగ బక్రీద్(ఈద్ ఉల్ అధా) సమీపిస్తున్న సమయంలో జంతువులను బలిచ్చేందుకు చాలా మంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలో ఇటీవల కాలంలో ఇటువంటి నేరాలు ఎక్కువగా పెరిగాయి. వేలు, లక్షల్లో విక్రయించబడుతున్న జంతువులను అమ్మేందుకు వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకుని వాటిని దొంగిలిస్తున్నారు.
ఈ మెగా ఈవెంట్ లో చిరకాల ప్రత్యర్ధిలు భారత్-పాకిస్తాన్ టీమ్స్ ఆక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా తాడోపేడో తెల్చుకోనున్నాయి. అదే రోజు పాకిస్తాన్ సారథి బాబర్ ఆజం పుట్టిన రోజు కావడం విశేషం.
పాకిస్థాన్ లో సిక్కులపై దాడులు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో భారత ప్రభుత్వం సీరియస్ అయింది. గడచిన మూడు నెలల్లోనే దుండగులు నలుగురు సిక్కులను కాల్చి చంపారు.
ఈ ఏడాది ప్రారంభం నుంచి పాకిస్తాన్లో మహిళలు, పిల్లలపై నేరాలకు సంబంధించిన నివేదిక ఒకటి వెలుగులోకి వచ్చింది. సస్టైనబుల్ సోషల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (SSDO) నివేదిక ప్రకారం, ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో మహిళలు, పిల్లలపై హింసకు సంబంధించి 900 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి.