పాకిస్థాన్ దివాలా తీయడానికి కారణం భారత్, అమెరికా దేశాలు కారణం కాదని ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. మన దరిద్రానికి మనమే కారణమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మన కాళ్లను మనమే నరుక్కున్నామంటున్నామని పరోక్షంగా మిలట్రీపై తీవ్ర విమర్శలు విమర్శలు గుప్పించారు. 2018 ఎన్నికల్లో రిగ్గింగ్ జరిపి, వారికి (ఆర్మీ) నచ్చిన ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ప్రజల నెత్తిన రుద్దారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో దేశం ఆర్థికంగా దివాలా తీసింది.. దీంతో ప్రజలు కష్టాల పాలు అయ్యారని నవాజ్ షరీఫ్ ఆరోపించారు.
Read Also: Bihar : మద్యం డెన్‌పై సోదాలకు వచ్చిన పోలీసులపై దాడి.. ఇన్‌స్పెక్టర్ మృతి, హోంగార్డుకు గాయాలు
ఇక, పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ (పీఎంఎల్-ఎన్) పార్టీ అధినేత నవాజ్ షరీఫ్ పాకిస్థాన్ దేశానికి మూడు సార్లు ప్రధాన మంత్రిగా తన సేవలను అందించారు. వచ్చే జనవరిలో జరుగనున్న ఎన్నికల్లో గెలిచి మరో సారి ప్రధాని కావాలని ఆయన ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో పీఎంఎల్- ఎన్ పార్టీ టికెట్ ఆశిస్తున్న వారితో ఆయన తాజాగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ ప్రస్తుత పరిస్థితికి, ప్రజల కష్టాలకు పక్క దేశాలు ఎలా కారణం అవుతాయని ఆయన ప్రశ్నించారు.
అయితే, పాకిస్థాన్ లో న్యాయ వ్యవస్థ కూడా ఆర్మీకి వంత పాడుతుంది.. ఆర్మీ నిర్ణయాలకు జడ్జిలు తలూపుతారని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ విమర్శలు గుప్పించారు. రాజ్యాంగ అతిక్రమణ జరుగుతున్నా కల్పించుకోరు.. పార్లమెంటును రద్దు చేస్తున్నామని ఆర్మీ ప్రకటన చేయగానే జడ్జిలు దానికి ఆమోద ముద్ర వేస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయాలే దేశాన్ని అధోగతి పాలు చేశాయి.. ప్రజలను మరింత కష్టాల్లోకి నెట్టాయని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోపణలు చేశారు. అయితే 1993, 1999, 2017లో తమ ప్రభుత్వాన్ని మిలిటరీనే కూల్చిందని నవాజ్ షరీష్ ఆరోపించారు. పాకిస్థాన్ ఆర్థికంగా వెనుబడి ఉండానికి భారత్ కానీ, అమెరికా కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ కారణం కాదని ఆయన చెప్పారు. ఆర్మీ జోక్యం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని ఆయన చెప్పారు.
It was not India, US or Afghanistan who have brought Pakistan to the current state, we ourselves are responsible, says Pakistan's Nawaz Sharif pic.twitter.com/2ZcupF1dZY
— Sidhant Sibal (@sidhant) December 20, 2023