Pakistan: పాకిస్తాన్ పరిస్థితి గతంలో ఎప్పుడూ లేనంత ఘోరంగా తయారైంది. ఓ వైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు ఉగ్రవాదం, రాజకీయ అస్థిరత ఇలా ఆ దేశం అనేక కష్టాల్లో చిక్కుకుంది. ఇక ఆ దేశంలోని అన్ని సంస్థలు దాదాపుగా దివాళా అంచుకు చేరుకుంటున్నాయి. ఇందులో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచి పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) కూడా ఒకటి. ఇంధన ధరలు పెరిగిపోవడం, అప్పులు ఇలా పీఐఏ ఆర్థిక సమస్యల్లో ఉంది. తమను ఆదుకోవాలని దేశ ప్రభుత్వాన్ని కోరింది.
అరేబియా సముద్రంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. భారతీయ నౌకాదళం, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) మంగళవారం నాడు ఈ భారీ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో సుమారు 3,300 కేజీల మాదకద్రవ్యాల్ని సీజ్ చేశారు.
Pakistan: సింధు నదీ ఉపనది అయిన రావి నది నీటిని భారత్ నిలిపేసింది. దీంతో ఒక్కసారిగా పాకిస్తాన్ ఉలిక్కిపడుతోంది. ఇప్పటికే చీనాబ్ నదీ నీటిని భారత్ డైవర్ట్ చేసింది, తాజాగా రావి నది నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు షాపుర్కండి బ్యారేజీని నిర్మించింది. ఈ బ్యారేజ్ వల్ల జమ్మూ లోని కథువా, సాంబా ప్రాంతాల రైతులకు సాగు నీరు అందించడమే కాకుండా, విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. దీని వల్ల పంజాబ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలు లాభపడనున్నాయి. సింధు నదీ…
పాకిస్థాన్ దేశానికి భారతదేశం మరో షాక్ ఇచ్చింది. రావి నది జలాలను పూర్తిగా నిలిపి వేసినట్లు సమాచారం. అయితే, దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న షాపుర్ కండీ ఆనకట్ట నిర్మాణం పూర్తి కావడమే దీనికి ప్రధాన కారణం.
పీటీఐ వ్యవస్థాపకుడు, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన లాయర్లను జైలులోనే ఒంటరిగా కలిసేందుకు ఇస్లామాబాద్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. జైలు హ్యాండ్‌బుక్ ప్రకారం.. ఇమ్రాన్‌ఖాన్‌ను ఒంటరిగా కలిసేందుకు న్యాయవాదులను అనుమతించాలని జైలు నిర్వాహకులను కోర్టు ఆదేశించింది.
పాకిస్థాన్‌లోని లాహోర్‌లో యువతి డ్రెస్ పై అరబిక్ భాషలో ఖురాన్‌ను కించపరిచే రాతలున్నాయన్న ఆరోపణలతో కొందరు చుట్టుముట్టారు. వెంటనే ఓ మహిళా పోలీసు ఆ యువతిని ఆ మూక నుంచి రక్షించింది.
Ravi River: సింధు దాని ఉపనదుల జలాలను భారత్ సమర్థవంతంగా వాడుకునేందుకు సిద్ధమైంది. పంజాబ్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో నిర్మితమవుతున్న షాపూర్ కంది బ్యారేజ్ నిర్మాణం తుదిదశకు చేరుకోవడంతో పాకిస్తాన్‌కి రావి నది నీటి ప్రవాహాన్ని భారత్ నిలిపేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్లోకి ప్రవహించే 1150 క్యూసెక్కుల రావి నది నీటిని ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌లోని కథువా, సాంబా జిల్లాల్లోని 32,000 హెక్టార్ల భూమికి సాగు నీరుగా ఇవ్వనున్నారు.
Yana Mir: భారత్‌లో జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో మైనారిటీలను అణిచివేస్తున్నారని, ఇండియన్ ఆర్మీ దురాగతాలకు పాల్పడుతోందని వెస్ట్రన్ మీడియాతో పాటు పాకిస్తాన్ ప్రేలాపనలను కాశ్మీరీ యువతి, హక్కుల కార్యకర్త యానా మీర్ కొట్టిపారేసింది. తప్పుడు ప్రచారాలు చేస్తున్న ‘‘టూల్‌కిట్ ఫారిన్ మాడియా’’పై ఆమె విరుచుకుపడింది. బ్రిటన్ పార్లమెంట్లో ఆమె చేసిన ప్రసంగం ఇప్పుడు వైరల్‌గా మారింది.
Cross-border marriage: ఇటీవల కాలంలో సరిహద్దు దాటి ప్రేమలు విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్‌కి చెందిన పలువురు యువతీయువకులు ప్రేమించుకున్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. సీమా హైదర్ అనే పాకిస్తానీ యువతి, పబ్జీ ద్వారా పరిచయమైన లవర్ సచిన్ కోసం భారత్ వచ్చిన వార్త సంచలనంగా మారింది. తాజాగా భారత్‌కి చెందిన ఓ యువతి, పాకిస్తాన్ వ్యక్తిని ప్రేమించింది.