USA: ‘‘ఇంట్లోకి దూరి చంపేస్తాం’’.. పీఎం మోడీ వ్యాఖ్యలపై స్పందించిన అమెరికా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
USA: పాకిస్తాన్ గడ్డపై నుంచే భారత వ్యతిరేక తీవ్రవాదం వ్యాప్తి చెందుతుందనే ఆరోపణలపై స్పందించేందుకు అమెరికా నిరాకరించింది. ఇరు దేశాలు కూడా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాని బుధవారం పేర్కొంది. అమెరికా అత్యున్నత అధికారి మాథ్యూ మిల్లర్ మాట్లాడుతూ.. రెండు దేశాలు కూడా ఉద్రిక్తతలను పెరగకుండా చూసుకోవాలని సూచించారు. ఇటీవల ఏప్రిల్ 5న బ్రిటిష్ వార్త పత్రిక ది గార్డియన్ ఒక కథనంలో.. పాకిస్తాన్ వ్యాప్తంగా జరుగున్న టార్గెటెడ్ హత్యల్లో్ భారత ప్రమేయం ఉందని ఆరోపించింది. అయితే, గార్డియన్ కథనాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది.
Read Also: Viral Video : హోటల్లలో మీరు తినే చట్నీ ఫ్రెషేనా.. ఈ వీడియో చూస్తే డౌట్ రావడం ఖాయం
Also Read
ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. ఉగ్రవాదుల్ని హతమార్చేందుకు సరిహద్దులను కూడా దాటేందుకు భారత్ వెనకడాడని వ్యాఖ్యానించారు. ‘‘ఇంట్లోకి దూరి ఉగ్రవాదుల్ని చంపేస్తాం’’ అని అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై ప్రశ్నించగా.. ‘‘అమెరికా ఈ సమస్య మధ్యకు రావాలనుకోవడం లేదు. అయతే, భారత్- పాకిస్తాన్ పరిస్థితి తీవ్రత పెంచకుండా చర్చల ద్వారా పరిష్కారాలు కనుగొనాలని ప్రోత్సహిస్తాం’’ అని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిథి మాథ్యూ మిల్లర్ చెప్పారు.
ఇటీవల గార్డియన్ కథనం వెలువడిన తర్వాత రిషికేష్‌లో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు, దేశంతలో బలమైన ప్రభుత్వం ఉంది. బలమైన మోడీ ప్రభుత్వంలో ఉగ్రవాదులను వారి ఇళ్లలోకి చొరబడి చంపుతాం’’ అని వ్యాఖ్యానించారు. దేశ శాంతికి విఘాగం కలిగించే ఉగ్రవాదుల్ని ప్రభుత్వం విడిచిపెట్టదని, వారు పాకిస్తాన్ తిరిగి వెళ్లినా వేటాడటం ఖామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ స్పందిస్తూ.. భారత్ రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని చేస్తుందని ఆరోపించింది. ఇలాంటివి దీర్ఘకాలిక సంబంధాలకు విఘాతమని పేర్కొంది. పాకిస్తాన్ శాంతి కోసం ఎల్లప్పుడూ తన నిబద్ధతను ప్రదర్శిస్తుందని పేర్కొంది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!