PM Modi: కాంగ్రెస్‌లా ప్రేమ లేఖలు పంపే కాలం పోయింది.. ఇళ్లలోని దూరి ఉగ్రవాదుల్ని చంపేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ మరోసారి కాంగ్రెస్ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన జేఎంఎం-కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలను ‘‘పిరికిపంద’’గా అభివర్ణించారు. జాతీయ భద్రతపై కాంగ్రెస్ సరిగా వ్యవహరించలేదని ఆయన శనివారం పాలములో జరిగిన ర్యాలీలో మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయిందని, సహాయం కోసం పాకిస్తాన్ ఇప్పుడు ‘‘ఏడుస్తోంది, అరుస్తోంది’’ అని అన్నారు.
Read Also: S Jaishankar: బైడెన్ ‘జెనోఫోబిక్’ వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించిన జైశంకర్..
Also Read
- Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
గతంలో ఉగ్రవాదుల దాడుల తర్వాత కాంగ్రెస్ పిరికి ప్రభుత్వాలు ప్రపంచ వేదికపై ఏడ్చేదని, ప్రస్తుతం ప్రపంచవేదికపై భారత్ ఏడ్చే కాలం పోయింది. ఇప్పుడు పాకిస్తానే సాయం కోసం ఏడుస్తోందని ప్రధాని మోడీ అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు శాంతిని కాంక్షిస్తూ పాకిస్తాన్‌కి ప్రేమ లేఖలు రాసేవని, దీని ప్రతిస్పందనగా పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పంపేదని ఆయన అన్నారు. నేటి భారత్ లేఖల్ని రాయదు, ఇది కొత్త భారతదేశం, ఇంట్లోకి దూరి ఉగ్రవాదుల్ని చంపేస్తుందని అన్నారు.
సర్జికల్ స్ట్రైక్స్‌తో అల్లాడిపోయిన పాకిస్తాన్ ఇప్పుడు యువరాజును(రాహుల్ గాంధీ)ని ప్రధాని చేయాలని ప్రార్థిస్తోందని, అయితే భారత్ మాత్రం బలమైన ప్రభుత్వం కావాలని కోరుకుంటోందని అన్నారు. ఇటీవల పాకిస్తాన్ మాజీ మంత్రి రాహుల్ గాంధీ వీడియోను షేర్ చేసి ‘రాహుల్ గాంధీ అన్ ఫైర్’’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ ఘాటుగా స్పందిస్తోంది. కాంగ్రెస్ పాకిస్తాన్ మద్దతు కోరుతోందని బీజేపీ నేతలు విమర్శించారు. గతంలో బలహీన ప్రభుత్వాలతో పోల్చితే ప్రస్తుతం బీజేపీ ఉగ్రవాదంపై స్థిరమైన, పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని అన్నారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!