Rahul Gandhi: రాహుల్ గాంధీపై పాకిస్తాన్ మాజీ మంత్రి ప్రశంసలు.. బీజేపీ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: పాకిస్తాన్ మాజీ మంత్రి సోషల్ మీడియాలో రాహుల్ గాంధీని పొగుడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ క్యాబినెట్‌లో సమాచార మంత్రిగా పనిచేసిన ఫవాద్ హుస్సేన్ ‘‘రాహుల్ గాంధీ అన్ ఫైర్’’ అనే కామెంట్స్ చేశారు. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వీయా, పాకిస్తాన్‌తో కాంగ్రెస్ సంబంధాన్ని ప్రశ్నించారు.
‘‘ఇమ్రాన్ ఖాన్ క్యాబినెట్‌లో సమాచార మరియు ప్రసార శాఖ మంత్రిగా పనిచేసిన సి.హెచ్. ఫవాద్ హుస్సేన్ రాహుల్ గాంధీని ప్రమోట్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ యోచిస్తోందా?’’ అని ప్రశ్నించారు. ముస్లిం లీగ్ ఆనవాళ్లు ఉన్న మానిఫేస్టోని కలిగిన పార్టీకి పాకిస్తాన్ నుంచి మద్దతు లభిస్తోందని చెప్పారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా కూడా ఇదే విధంగా స్పందించారు. పాకిస్తాన్‌తో కాంగ్రెస్ స్పష్టమైన పొత్తును కలిగి ఉందని ఆరోపించారు.
Also Read
- CBSE Gets New Chairman: CBSEకి కొత్త ఛైర్మన్.. ఎవరీ మందీప్ భండారీ?.. పూర్తి వివరాలు ఇవే
- AFSPA Extension: మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లో.. AFSPA మరో ఆరు నెలలు పొడిగింపు
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
Read Also: Kharge: ప్రధాని మోడీకి ఖర్గే లేఖ.. దేనికోసమంటే..!
పూనావాలా సోషల్ మీడియా పోస్టులో స్పందిస్తూ.. ‘‘కాంగ్రెస్ తన అభిమాన పార్టీ అని గతంలో ఉగ్రవాది హఫీస్ సయీద్ చెప్పారు. మణి శంకర్ అయ్యర్ ప్రధాని మోడీని నిలదీయడానికి మద్దతు కోసం పాకిస్తాన్ వెళ్లాడు. ఇటీవల కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు లేవనెత్తారు. బీకే హరిప్రసాద్ ఏకంగా బహిరంగంగానే పాక్‌కి మద్దతుగా మాట్లాడటం గుర్తుంది. పదేపదే కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్, దాని ఉగ్రవాదుల్ని సమర్థిస్తున్నారు’’ అని అన్నారు.
పాక్ మాజీ మంత్రి ఫవాద్ హుస్సేన్ షేర్ చేసిన వీడియోలో.. రాహుల్ గాంధీ ముఖ్యంగా నరేంద్రమోడీని లక్ష్యంగా చేసుకుని విమర్శించడం వినొచ్చు. రామ మందిరం ప్రారంభోత్సవానికి సంబంధించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని వినొచ్చు. బీజేపీ అట్టడుగు వర్గాల ప్రయోజాలను విస్మరిస్తోందని ఆరోపించారు.
తాజావార్తలు
-
CBSE Gets New Chairman: CBSEకి కొత్త ఛైర్మన్.. ఎవరీ మందీప్ భండారీ?.. పూర్తి వివరాలు ఇవే
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
AFSPA Extension: మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లో.. AFSPA మరో ఆరు నెలలు పొడిగింపు
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!