Pakistan-Bangladesh: గతేడాది హింసాత్మక విద్యార్థి అల్లర్ల తర్వాత, షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ పారిపోయి వచ్చింది. మొహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడిగా మారాడు. ఈయన హయాంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య స్నేహం చిగురిస్తోంది. 1970లలో బంగ్లాదేశ్(తూర్పు పాకిస్తాన్ ఒకప్పుడు)లో ఎన్నో అత్యాచారాలకు పాల్పడిన పాకిస్తాన్ పట్ల స్నేహభావంతో మెలుగుతోంది. యూనస్ వచ్చిన తర్వాత, బంగ్లా పాక్ మధ్య సైనిక, వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెరిగాయి.
Read Also: Mythri Movie Makers : “చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్” ను తెలుగులో రిలీజ్ చేస్తున్న మైత్రీ మూవీస్
తాజాగా, పాకిస్తాన్ బంగ్లాదేశ్‌కు 1,00,000 టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేయనుంది. దీని కోసం ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ పాకిస్తాన్ (టీసీపీ) గత వారం టెండర్లు కూడా జారీ చేసింది. ఇప్పటి వరకు పాకిస్తాన్ ఎగుమతి చేసిన బియ్యంలో ఇదే అత్యధికం. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రెండు దేశాలు బియ్యం దిగుమతులతో ప్రభుత్వ స్థాయి వాణిజ్యాన్ని ప్రారంభించిన తర్వాత 50,000 టన్నుల బియ్యాన్ని మొదటి బ్యాచ్ ఎగుమతి చేశారు.
ఇదిలా ఉంటే, మరోవైపు బంగ్లా-పాకిస్తాన్ మధ్య సైనిక సంబంధాలు కూడా పెరుగుతున్నాయి. ఈ పరిణామాలు భారత్‌కు వార్నింగ్ మెసేజ్‌లు పంపుతున్నాయి. ఇటీవల పాకిస్తాన్ సైనిక ఉత్పత్తి రంగానికి చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్‌తో భేటీ అయ్యారు. పాకిస్తాన్‌లోని హెవీ ఇండస్ట్రీస్ టాక్సిలా (HIT) చైర్మన్ లెఫ్టినెంట్ జనరల్ షకీర్ ఉల్లా ఖట్టక్, జమాన్‌లో భేటీ అయ్యారు. దీనికి ముందు అక్టోబర్ 26న, పాకిస్తాన్ సైనిక అధికారి, పాకిస్తాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ (CJCSC) చైర్మన్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జా, మొహమ్మద్ యూనస్‌ను కలిశారు. పాకిస్తాన్ నేవీ చీఫ్ అడ్మిరల్ నవీద్ అష్రఫ్ గత నెలలో బంగ్లా ఆర్మీ చీఫ్‌తో భేటీ అయ్యారు. ఈ పరిణామాలు భారత్‌కు హెచ్చరికగా మారాయి.