Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై పాక్ రక్షణ మంత్రి కీలక ప్రకటన
- ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారంటూ వదంతులు
- పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు నిరసనలు
- ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై కీలక ప్రకటన చేసిన పాక్ ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ జైల్లో హత్యకు గురయ్యారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. రావల్పిండిలోని జైలు దగ్గర నిరసనలు చేపట్టారు. ఇంకోవైపు ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమకు చూపించాలంటూ డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Hong Kong: హాంగ్ కాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 44 మంది సజీవదహనం
Also Read
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారన్న వార్తలను రావల్పిండి జైలు అధికారులు ఖండించారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నారని.. మంచి ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు. ఇమ్రాన్ ఖాన్‌కు ఫైవ్‌స్టార్ హోటల్‌లో కంటే మెరుగైన ఆహారం అందుతోందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. ప్రస్తుతం జైల్లో ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: US: వైట్‌హౌస్ దగ్గర కాల్పులు.. ఇద్దరు నేషనల్ గార్డ్స్‌కు సీరియస్!
ఇక ఇమ్రాన్ ఖాన్‌ను చూపించాలని సోదరీమణులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు జైలు అధికారులు అనుమతి ఇచ్చారు. డిసెంబర్ 2న కలిసేందుకు పర్మిషన్ ఇచ్చారు. ఇమ్రాన్ ఖాన్‌ను మరొక జైలుకు తరలిస్తున్నారన్న వార్తలను అధికారులు ఖండించారు. ఎక్కడికీ తరలించడం లేదని స్పష్టం చేశారు.
అవినీతి ఆరోపణలపై 2023 నుంచి రావల్పిండి అడియాలా జైల్లో ఇమ్రాన్ ఖాన్ శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఇటీవల ఇమ్రాన్ ఖాన్ అక్కాచెల్లెళ్లు ఆయనను కలిసేందుకు అధికారులు అనుమతించకపోవడం అనుమానాలు రేకెత్తాయి. చివరకు ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సు సీఎంను కూడా అధికారులు అనుమతించలేదు. ఈ నేపథ్యంలోనే హత్యకు గురయ్యారంటూ పుకార్లు మొదలయ్యాయి. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని పాక్ ప్రభుత్వం స్పష్టంచేసింది.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!