Pakistan: పాకిస్తాన్‌కు ఫిన్లాండ్ షాక్.. రాయబార కార్యాలయం మూసివేత..
- పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చిన ఫిన్లాండ్..
- ఎంబసీ మూసేస్తున్నట్లు ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ బయటకు ఎన్ని బీరాలు పలుకుతున్నా కూడా తోటి ముస్లిం దేశాలు పట్టించుకోవడం లేదు. సౌదీ అరేబియా, యూఏఈ వంటి ఇస్లామిక్ దేశాలు పాకిస్తానీయులకు నో ఎంట్రీ బోర్డు పెడుతున్నాయి. పాకిస్తాన్ నుంచి వెళ్లిన వారు ఈ దేశాల్లో భిక్షాటన చేయడం, నేరాలకు పాల్పడుతుండటంతో ఆయా దేశాలు వీరికి వీసాలు మంజూరు చేయడం లేదు.
ఇదిలా ఉంటే, తాజాగా పాకిస్తాన్‌కు మరో షాక్ తగిలింది. ఆపరేషనల్, వ్యూహాత్మక కారణాలను చెబుతూ పాకిస్తాన్‌లో ఫిన్లాండ్ తన రాయబార కార్యాలయాన్ని మూసేయనుంది. ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్ దేశాల్లో కూడా ఎంబసీలను క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. “2026లో ఇస్లామాబాద్, కాబూల్, యాంగోన్‌లలోని ఫిన్లాండ్ రాయబార కార్యాలయాలను మూసివేయాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది” అని ఫిన్లాండ్ విదేశాంగ మంత్రి శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు. ‘‘ఆపరేషనల్, వ్యూహాత్మక కారణాల వల్ల రాయబార కార్యాలయాలు మూసివేయబడుతాయి. ఇది దేశాల రాజకీయ పరిస్థితుల్లో మార్పులు, ఫిన్లాండ్‌తో వారి పరిమిత వాణిజ్య, ఆర్థిక సంబంధాలతో ముడిపడి ఉన్నాయి’’ అని ప్రకటన తెలిపింది.
Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
పాకిస్తాన్‌తో సహా మూడు దేశాల్లో రాయబార కార్యాలయ మూసివేతకు సంబంధించిన సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని ఫిన్లాండ్ మంత్రిత్వ శాఖ తెలిపింది. వ్యూహాత్మక సమీక్షలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. తమకు వ్యూహాత్మకంగా ముఖ్యమైన దేశాలకు వనరుల్ని కేంద్రీకరించడం ముఖ్యమని చెప్పింది. దీనిని బట్టి చూస్తే పాకిస్తాన్ మాకు అవసరం లేదని స్పష్టం చేస్తునట్లు కనిపిస్తోంది. దీనికి ముందు 2012లో పాకిస్తాన్‌లో రాయబార కార్యాలయాన్ని, బడ్జెట్ పరిమితులను కారణంగా చూపిస్తూ మూసేసింది. 2022లో మళ్లీ ప్రారంభించింది. ఇప్పుడు 2026లో మళ్లీ మూసేస్తోంది. 2023లో స్వీడన్ భద్రతా కారణాలను చెబుతూ పాక్‌లో తన ఎంబసీని నిరవధికంగా క్లోజ్ చేసింది.
తాజావార్తలు
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..