పాకిస్తాన్ ఆర్మీకి బలూచ్ లిబరేషన్ ఆర్మీ చుక్కలు చూపిస్తోంది. అనూహ్య దాడులకు పాల్పడుతూ పాక్ సైన్యానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో కలాట్, క్వెట్టాలో జరిగిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో 29 మంది పాకిస్తానీ భద్రతా దళాలను హతమార్చినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) పేర్కొంది. పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా ఈ యుద్ధాన్ని కొనసాగిస్తామని బీఎల్ఏ తెలిపింది. బలూచిస్తాన్ కు స్వాతంత్ర్యం వచ్చే వరకు పాక్ సైన్యం తగిన మూల్యం చెల్లించుకుంటుందని తెలిపారు. Also…
జైలులో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలు లోపల తనకు ఏదైనా జరిగితే, దానికి ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ బాధ్యత వహిస్తారని ఆయన అన్నారు. ఖాన్‌ను విడుదల చేయాలని షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం, సైనిక వ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) ఆగస్టు 5 నుంచి దేశవ్యాప్తంగా భారీ నిరసనను చేపట్టబోతోంది. Also Read:Off The Record: ఆదాల పార్టీ…
Balochistan: పాకిస్తాన్‌ను బలూచ్ లిబరేషన్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) వణికిస్తోంది. కొత్తగా ‘‘ఆపరేషన్ బామ్’’ చేపట్టింది. దీంతో పాక్ సైన్యం, భద్రతా బలగాలు వణికిపోతున్నాయి. పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్‌కు విముక్తి కల్పించేందుకు బీఎల్ఎఫ్ పోరాడుతోంది. బుధవారం బలూచిస్తాన్‌లోని టర్బాట్‌లో జరిగిన గ్రెనేడ్ దాడిలో మహిళలు, పిల్లలు సహా కనీసం ఐదుగురు గాయపడ్డారు. దక్షిణ బలూచిస్తాన్‌లోని కెచ్ జిల్లాలో భాగమైన టర్బాట్‌లోని అబ్సర్ ప్రాంతంలోని ముహమ్మద్ యూనిస్ నివాసంపై మోటార్ సైకిళ్లపై వచ్చిన గుర్తు తెలియని దుండగులు హ్యాండ్ గ్రెనేడ్ విసిరారు.
Imran Khan: పాకిస్తాన్ ప్రభుత్వం నిరంకుశ విధానాలను అమలు చేస్తున్నారని మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఇటీవల పార్లమెంట్ చేసిన ఓ చట్ట సవరణను ఉద్దేశిస్తూ ఎక్స్ (ట్విట్టర్)లో స్పందించిన ఆయన.. ఈ బానిసత్వాన్ని తాను అంగీకరించడానికి బదులు జైల్లో చీకటి గదిలో జీవించడానికి ఇష్టపడతానని రాసుకొచ్చారు.
Asim Munir: ‘‘ఆపరేషన్ సిందూర్’’ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కి ఆ దేశం ఫీల్డ్ మార్షల్‌గా పదోన్నతి కల్పించింది. అయితే, ఆ దేశ ప్రజలు ఆసిమ్ మునీర్ ‘‘ఫీల్డ్ మార్షల్ కాదు ఫేయిల్డ్ మార్షల్’’ అంటూ విమర్శిస్తున్నారు. తాజాగా, ఆసిమ్ మునీర్ అధికారిక పర్యటన కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ ఆయనకు తీవ్ర అవమానం జరిగింది. వాషింగ్టన్‌లో పాకిస్తాన్ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో…
Pakistan: పాకిస్తాన్‌కి కొత్త సంక్షోభం వచ్చి పడింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, తిరుగుబాటు, ఉగ్రవాదంతో సతమతం అవుతున్న ఆ దేశాన్ని ఇప్పుడు ‘‘నీటి సంక్షోభం’’ భయపెడుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ 1960 నాటి ‘‘సింధు జలాల ఒప్పందం’’ నిలిపేసింది. దీని ప్రభావం ప్రస్తుతం పాకిస్తాన్ లో స్పష్టంగా కనిపిస్తోంది. సింధు, జీలం, చీనాబ్ నదులతో కూడిన సింధు నది వ్యవస్థలో నీటి కొరత కనిపిస్తోంది. పంజాబ్ ప్రావిన్స్‌లో ఖరీఫ్(వానాకాలం పంటల) విత్తే కాలం దగ్గర పడుతున్న…
Pakistan: పాకిస్తాన్ ఓ వైపు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, ఆ దేశం సైన్యానికి మాత్రం బాగా ఖర్చు చేస్తోంది. ప్రజల గురించి ఆలోచించడం మానేసి, భారత వ్యతిరేకతతోనే బతుకుతోంది. దేశాన్ని ఆర్థిక గండం నుంచి బయటపడేసేందుకు ప్రధాని నేతృత్వంలోని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకుల ముందు సాగిలపడుతోంది. ఇదే కాకుండా, పాకిస్తాన్ మిత్రదేశాల పర్యటనలకు వెళ్లి ‘‘భిక్షం’’ అడుగుతోంది.
Pakistan Army: అన్ని దేశాలకు సైన్యం ఉంటుంది, కానీ పాకిస్తాన్ విషయంలో మాత్రం ఓ సైన్యానికి దేశం ఉందని చెప్పవచ్చు. భారత్ వంటి దేశాల్లో మిలిటరీ చీఫ్‌లుగా పని చేసిన వారు రిటైర్మెంట్ తర్వాత సాధాసీదా జీవితం గడుపుతారు. కానీ పాకిస్తాన్‌లో అలా కాదు మిలిటరీలో చేరితే జాక్‌పాట్ కొట్టినట్లు, ప్రభుత్వమే పదుల నుంచి వందల ఎకరాల భూమిని ఆర్మీలో పనిచేసిన వారికి ఇస్తుంది.
Pakistan : పాకిస్థాన్‌లో హిందూ సమాజానికి ఇబ్బందులు పెరుగుతున్నాయి. దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లో నివసిస్తున్న హిందూ సమాజానికి చెందిన ప్రజలు భయం నీడలో జీవించవలసి వస్తుంది.