పాకిస్తాన్ ఆర్మీకి బలూచ్ లిబరేషన్ ఆర్మీ చుక్కలు చూపిస్తోంది. అనూహ్య దాడులకు పాల్పడుతూ పాక్ సైన్యానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో కలాట్, క్వెట్టాలో జరిగిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో 29 మంది పాకిస్తానీ భద్రతా దళాలను హతమార్చినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) పేర్కొంది. పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా ఈ యుద్ధాన్ని కొనసాగిస్తామని బీఎల్ఏ తెలిపింది. బలూచిస్తాన్ కు స్వాతంత్ర్యం వచ్చే వరకు పాక్ సైన్యం తగిన మూల్యం చెల్లించుకుంటుందని తెలిపారు.
బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒక ప్రకటన విడుదల చేస్తూ, క్వెట్టాలోని బీఎల్ఏ ప్రత్యేక విభాగం ఫతా స్క్వాడ్ పాకిస్తాన్ సైనిక సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సును లక్ష్యంగా చేసుకుని ఐఈడీ దాడి చేసిందని తెలిపింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ తన నిఘా విభాగం ZIRAB నుంచి నిఘా సమాచారం అందుకున్న తర్వాత ఈ దాడి చేసింది.
పాకిస్తాన్ సైనికులతో వెళ్తున్న బస్సును జిరాబ్ నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంది. ఈ బస్సు కరాచీ నుంచి క్వెట్టాకు పాకిస్తాన్ సైనికులతో వెళుతోంది. ఈ దాడిలో 27 మంది పాకిస్తాన్ సైనికులు అక్కడికక్కడే మరణించగా, చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ బస్సులో ఖవ్వాలి గాయకులు కూడా ఉన్నారు.
Also Read:Iran: అమెరికా, ఇజ్రాయెల్‌కు ఖమేనీ వార్నింగ్.. ఈసారి కాలు దువ్వితే..!
ఈ ఖవ్వాలీ కళాకారులు మా లక్ష్యం కాదని, అందుకే వారిని ముట్టుకోలేదని బీఎల్ఏ తెలిపింది. ఇంతలో, బీఎల్ఏ కలాట్‌లోని హజర్ గంజి ప్రాంతంలో మరో ఐఈడీ దాడి చేసింది. పాకిస్తాన్ సైన్యం వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు సైనికులు మరణించారు. కలాట్‌లో బీఎల్ఏ ఆపరేషన్‌లో పాకిస్తాన్ సైన్యానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి.
Also Read:Kingdom : హమ్మయ్య కింగ్డమ్ నిర్మాత గట్టిక్కినట్టే.. OTT ఎంత వచ్చిందంటే
ఈ దాడులకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ బాధ్యత వహించిందని, బలూచిస్తాన్ విముక్తి పొందే వరకు పాకిస్తాన్ సైన్యంపై మా యుద్ధం కొనసాగుతుందని , పాకిస్తాన్ సైన్యం దీనికి మూల్యం చెల్లించుకుంటుందని తెలిపింది. అంతకుముందు, మార్చి 11న, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన వారియర్స్ క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేశారు. ఈ సంఘటనలో 18 మంది భద్రతా సిబ్బందితో సహా 26 మందిని చంపారు.