Balochistan: “ఆపరేషన్ బామ్”తో పాకిస్తాన్‌కి దడ పుట్టిస్తున్న బలూచ్ వీరులు..
- ‘‘ఆపరేషన్ బామ్’’ ప్రారంభించిన బలూచ్ వీరులు..
- పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐపై ఏక కాలం దాడులు..
- బలూచిస్తాన్ స్వాతంత్య్ర కోసం పోరాటం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balochistan: పాకిస్తాన్‌ను బలూచ్ లిబరేషన్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) వణికిస్తోంది. కొత్తగా ‘‘ఆపరేషన్ బామ్’’ చేపట్టింది. దీంతో పాక్ సైన్యం, భద్రతా బలగాలు వణికిపోతున్నాయి. పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్‌కు విముక్తి కల్పించేందుకు బీఎల్ఎఫ్ పోరాడుతోంది. బుధవారం బలూచిస్తాన్‌లోని టర్బాట్‌లో జరిగిన గ్రెనేడ్ దాడిలో మహిళలు, పిల్లలు సహా కనీసం ఐదుగురు గాయపడ్డారు. దక్షిణ బలూచిస్తాన్‌లోని కెచ్ జిల్లాలో భాగమైన టర్బాట్‌లోని అబ్సర్ ప్రాంతంలోని ముహమ్మద్ యూనిస్ నివాసంపై మోటార్ సైకిళ్లపై వచ్చిన గుర్తు తెలియని దుండగులు హ్యాండ్ గ్రెనేడ్ విసిరారు.
మంగళవారం రాత్రి నుంచి బలూచిస్తాన్ అంతటా బీఎల్ఎఫ్ ‘‘ఆపరేషన్ బామ్’’ని ప్రారంభిస్తుంది. దీని అర్థం ‘‘తొలి వెలుగు’’. ఈ ఆపరేషన్ లో భాగంగా ఏక కాలంలో 17 చోట్ల దాడులు జరిగాయి. పంజ్‌గుర్, సురబ్, కెచ్, ఖరన్ జిల్లాల్లో దాడులు జరిగాయి. పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ, పోలీసులపై దాడులు జరిగాయి. ఈ దాడులకు తామే బాధ్యత వహిస్తున్నట్లు బీఎల్ఎఫ్ ప్రతినిధి మేజర్ గ్వాహ్రమ్ బలోచ్ ప్రకటించారు.
Also Read
Read Also: Kolkata: కోల్‌కతాలో మరో అత్యాచార ఘటన.. ఐఐఎం క్యాంపస్‌లో విద్యార్థినిపై రేప్..
బలూచిస్తాన్‌లో పాక్ ఆర్మీని వణికిస్తున్నారు. ఈ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలో మాత్రమే పాకిస్తాన్ అధికారం ఉంది. మిగతా ప్రాంతాలు అన్నీ బీఎల్ఎఫ్ ఆధీనంలోకి వెళ్లాయి. ఆపరేషన్ బామ్‌కు ముందు 2024లో మే, జూన్, జూలైలో ‘‘ఆపరేషన్ హెరాఫ్’’ దీని అర్థం నల్లతుఫాను. ఈ దాడులు కూడా పాక్ ఆర్మీని భయపెట్టింది. ఆ సమయంలో 102 పాక్ సైనికులు చనిపోయారు. ఏకంగా 50 స్థావరాలపై దాడులు చేశారు.
బలూచిస్తాన్ పాకిస్తాన్‌లో అతిపెద్ద ప్రావిన్సు. దాదాపు 40 శాతం భూభాగం ఉంటుంది. సహజ వనరులకు కేంద్రంగా ఉంది. అయితే, ఈ వనరులను బలూచ్‌లకు దక్కకుండా పాకిస్తాన్ పంజాబ్, చైనా కొల్లగొడుతోందని బలూచ్ వీరులు చెబుతున్నారు. దీంతో గత 20 ఏళ్లుగా బీఎల్ఎఫ్ పాక్ ప్రభుత్వంపై తిరుగుబడుతోంది. కొన్ని నెలల క్రితం బీఎల్ఎఫ్ ఏకంగా ‘‘జఫర్ ఎక్స్‌ప్రెస్’’ హైజాక్ జరిగింది. ఈ హైజాక్‌లో పాక్ ఆర్మీ, ఇంటెలిజెన్స్ అధికారుల్ని బీఎల్ఎఫ్ హతమార్చింది.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!