Pakistan: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్‌లో చావు తప్పించుకున్నప్పటికీ, ఆ దేశానికి సిగ్గు రావడం లేదు. తాజాగా, ఆయన మాట్లాడుతూ.. తూర్పు సరిహద్దులో భారత్‌తో, పశ్చిమ సరిహద్దులో ఆఫ్ఘానిస్తాన్‌తో టూ-ఫ్రంట్ వార్‌కు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని చెప్పారు. పాకిస్తాన్ రెండు దేశాలతో యుద్ధానికి ‘‘పూర్తిగా సిద్ధంగా ఉంది’’ అని అన్నారు. ఢిల్లీ ఉగ్రవాద దాడి సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Pakistan: పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ప్రతినిధి ఫర్హతుల్లా బాబర్ తన కొత్త పుస్తకంలో 26/11 ముంబై దాడుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంతో శాంతిగా ఉండేందుకు జర్దారీ అంగీకరించడం, అణ్వాయుధాలపై ‘‘నో ఫస్ట్ యూజ్’’ అనే విధానాన్ని ప్రతిపాదించినందుకే దాడులు జరిగినట్లు చెప్పారు. 'ది జర్దారీ ప్రెసిడెన్సీ: నౌ ఇట్ మస్ట్ బి టోల్డ్'లో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్‌తో జరిగిన ఇంటర్వ్యూలో బాబర్ ఈ విషయాలు…
Pakistan: ‘‘జై శ్రీ రామ్’’ అని మన దేశంలో నినదిస్తే, అందరూ కూడా గొంతు కలుపుతారు. అయితే, పాకిస్తాన్‌లో ఈ నినాదాలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం ముందు కరాచీలోని నేషనల్ స్టేడియంలో భారత జెండా కనిపించకపోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) వివరణ ఇచ్చింది. ఈ టోర్నీలో పాల్గొనే దేశాల జెండాలను స్టేడియం పైకప్పుపై ఎగురవేస్తున్నట్లు చూపించే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే..
Pakistan: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్‌తో మెరుగైన సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత్‌తో సంబంధాలను చెడగొట్టడంలో ఇమ్రాన్ కీలక పాత్ర పోషించారని ఆయన ఆరోపించారు.