Pakistan: 26/11 ముంబై దాడులపై బాంబ్ పేల్చిన పాక్ అధ్యక్షుడి సహాయకుడు..
- పాక్ అధ్యక్షుడి సన్నిహితుడి సంచలన వ్యాఖ్యలు..
- 26/11 ముంబై దాడులపై కీలక విషయాలు వెల్లడి..
- పాక్ ఆర్మీ, సైన్యం మధ్య విభేదాల గురించి వివరాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ప్రతినిధి ఫర్హతుల్లా బాబర్ తన కొత్త పుస్తకంలో 26/11 ముంబై దాడుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంతో శాంతిగా ఉండేందుకు జర్దారీ అంగీకరించడం, అణ్వాయుధాలపై ‘‘నో ఫస్ట్ యూజ్’’ అనే విధానాన్ని ప్రతిపాదించినందుకే దాడులు జరిగినట్లు చెప్పారు. ‘ది జర్దారీ ప్రెసిడెన్సీ: నౌ ఇట్ మస్ట్ బి టోల్డ్’లో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్‌తో జరిగిన ఇంటర్వ్యూలో బాబర్ ఈ విషయాలు తెలిపారు. జర్దారీ శాంతి ప్రతిపాదన పాకిస్తాన్ లోని యుద్ధోన్మాదులను రెచ్చగొట్టిందని చెప్పారు.
భారత్ కూడా అణ్వాయుధాల విషయంలో ‘‘నో ఫస్ట్ యూజ్’’ విధానానికి కట్టుబడి ఉంది, పాకిస్తాన్ కూడా అణ్వాయుధాలను మొదట ఉపయోగించదని జర్దారీ బహిరంగ ప్రతిపాదన చేయడం పాకిస్తాన్ లోని సైనిక వ్యవస్థను రెచ్చగొట్టిందని పుస్తకంలో పేర్కొన్నారు. జర్దారీ ఈ ప్రకటన ఇచ్చిన నాలుగు రోజుల తర్వాత నవంబర్ 26, 2008న ముంబైలో పాకిస్తానీ ఉగ్రవాదులు దాడులు చేసి 166 మందిని చంపినట్లు బాబర్ రాశారు. ఈ దాడులు భారత్‌తో శాంతి ప్రయత్నాలు దెబ్బతీసేందుకు చేసినవే అని అన్నారు.
Also Read
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
- G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
తన పుస్తకంలో పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం మధ్య విభేదాలను కూడా బాబర్ పేర్కొన్నాడు. ముషారఫ్ దేశాధినేతగా దిగిపోయిన తర్వాత, 2008లో జర్దారీ అధ్యక్ష పదివిలోకి రావడం పాక్ సైన్యానికి ఇష్టం లేదని, ఆర్మీ చీఫ్ జనరల్ అష్పాక్ పర్వేజ్ కయానీ అధ్యక్ష పదవిలో జర్దారీని ఉంచడం నచ్చలేదు అని చెప్పారు. ఆ సమయంలో జర్దారీకి బదులుగా కయానీ సింధ్ మాజీ సీఎం, రక్షణ మంత్రి అఫ్తాబ్ షాబాన్ మిరానీని అధ్యక్షుడిగా చూడాలనుకున్నారని వెల్లడించారు.
పాకిస్తాన్ నుంచి అరేబియా సముద్ర మార్గాన ముంబైకి వచ్చిన 10 మంది లష్కరే తోయిబా టెర్రరిస్టులు ముంబైలో భారీ దాడులు చేశారు. పాకిస్తాన్ ఐఎస్ఐ 2005 నుంచే లష్కరే ద్వారా ఈ దాడులకు ప్లాన్ చేసింది. 26/11 దాడుల్లో తాజ్ హోటల్, ట్రైడెంట్ హోటల్, సీఎస్టీ స్టేషణ్, చాబాద్ హౌజ్ వంటి వాటిని ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. 60 గంటల పాటు ఈ మారణహోమం జరిగింది.
తాజావార్తలు
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
-
Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!