Pakistan: ‘‘జై శ్రీ రామ్’’ అని మన దేశంలో నినదిస్తే, అందరూ కూడా గొంతు కలుపుతారు. అయితే, పాకిస్తాన్‌లో ఈ నినాదాలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. మనం ఊహించిన దాని కన్నా భిన్నంగా జరిగితే అది అద్భుతమే అవుతుంది. తాజాగా, రష్యాకు చెందిన కంటెంట్ క్రియేటర్ పాకిస్తాన్‌లోని సందడిగా ఉన్న వీధిలో ‘‘జై శ్రీ రామ్’’ అంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారుతోంది.
Read Also: Pakistan: మునీర్ కోసం రాజ్యాంగ సవరణకు పాకిస్థాన్ ప్రభుత్వం సన్నాహాలు..!
రష్యన్ కంటెంట్ క్రియేటర్ మాగ్జిమ్ షెర్బకోవ్, పాకిస్తానీ యూనిఫాం ధరించి ‘‘జై శ్రీరాం’’ అంటూ నినాదాలు చేశారు. అతడి వెనక ఉన్న స్థానికులు పాకిస్తాన్ జెండాలను పట్టుకుని నవ్వుతూ కనిపించారు. ఈ నినాదాలు చేయగానే పాకిస్తానీలు ఆగ్రహం వ్యక్తం చేస్తారని అనుకుంటాం. కానీ వారు కూడా ఇదే నినాదాలు చేయడం ఆశ్చర్యపరిచింది.
ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. వేలల్లో వ్యూస్ సంపాదించుకుంది. భారత్, పాకిస్తాన్ యూజర్ల నుంచి అనేక కామెంట్స్ వెల్లువెత్తాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యూజర్ ‘‘ అతను గత జన్మలో భారతీయుడు కావచ్చు’’ అని కామెంట్స్ చేశారు. ‘‘ఇక్కడ ప్రజలకు అభద్రతకు గురికాకుండా ఇతర మతాలను ఎలా గౌరవించాలో తెలుసు’’ అంటూ మరొకరు రాశారు.