PM Shahzab Sharif's comments on Pakistan's economic situation: పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి గురించి ఆ దేశ ప్రధాని షహజాబ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చివరకు పాకిస్తాన్ మిత్ర దేశాలు కూడా పాకిస్తాన్ దేశాన్ని డబ్బు కోసం అడుక్కునే దేశంగా చూడటం ప్రారంభించారని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు మనం మన మిత్ర దేశాలకు ఫోన్ చేసినా.. మనం వారి వద్దకు డబ్బులు అడుక్కునేందుకు…
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై పోరులో తగ్గేది లేదు అంటున్నారు. ఇటీవల కాలంలో ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. తన బలాన్ని చూపించుకోవడానికి భారీ ఎత్తున ప్రదర్శనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ మెడకు చుట్టుకున్నాయి. ఆగస్టు 20న జరిగిన ర్యాలిలో మహిళా న్యాయమూర్తిని బెదిరిస్తూ.. వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై ఉగ్రవాద కేసు నమోదు అయింది.
PAKISTAN FLOODS-one third of Pakistan underwater: అసలే ఆర్థిక ఇబ్బందులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్ పరిస్థితి వరదల కారణంగా దారుణంగా మారింది. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు ఈ ఏడాది రుతుపవన కాలంలో కురిశాయి. దీంతో పాకిస్తాన్ లో ఒక్కసారిగా భీకర వరదలు సంభవించాయి. సింధు నదితో పాటు దాని ఉపనదులు, స్వాత్ నదులు ఉప్పొంగి ప్రవహించాయి. దీంతో సింధ్ ప్రావిన్స్, బలూచిస్థాన్ ప్రావిన్సులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో పాటు ఖైబర్…
India flood aid to Pakistan: పాకిస్తాన్ గత మూడు దశాబ్దాల్లో ఎప్పుడూ లేని విధంగా భారీ వరదలతో అల్లాడుతోంది. ఏకంగా పాకిస్తాన్ లోని సింధ్, బలూచిస్థాన్ ప్రావిన్స్ వరదలతో అతలాకుతలం అవుతోంది. 100కు పైగా జిల్లాలు వరద బారినపడ్డాయి. ఇప్పటి వరకు 1000కి పైగా మరణాలు సంభవించగా.. 3 కోట్ల మంది వరదల వల్ల ప్రభావితం అయ్యారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ దేశాన్ని భారీ వరదలు, వర్షాలు తీవ్రంగా నష్టపరిచాయి. 6 లక్షలకు…
Pakistan Declares National Emergency: అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది.. మరోవైపు శ్రీలంక పరిస్థితి కళ్లముందు కనిపిస్తోంది దాయాది దేశానికి. పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక కష్టాల మధ్య ఆ దేశాన్ని వరదలు, భారీ వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. వరదల వల్ల ఏకంగా 937 మందికి పైగా మరణించారు. 3 కోట్ల మంది నిరాశ్రయులు అయ్యారని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో భారీ వరదల కారణంగా పాకిస్తాన్ ప్రభుత్వం ‘‘జాతీయ అత్యవసర పరిస్థితి’’ని ప్రకటించింది.
lions rates cheaper than buffaloes rates In Pakistan: పాకిస్తాన్ దేశాన్ని ఆర్థిక సమస్యలు చుట్టుముడుతున్నాయి. అక్కడి ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకునేందుకు విలాస వస్తువులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడమే మానేశాయి. దీంతో పాటు పెట్రోల్ ధరలు పెరిగాయి. గ్యాస్, ఇంధన కొరతతో విద్యుత్ సమస్యలు తెలత్తుతున్నాయి. ఇప్పుడు ఆర్థిక సమస్యలు జంతువులపై కూడా పడ్డాయి. ఇటీవల లాహోర్ సఫారీ జూలో ఆఫ్రికన్ సింహాలను అమ్మేందుకు జూ యాజమాన్యం ప్రయత్నిస్తోంది. ఒక్కో సింహానికి…
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని శ్రీలంక అల్లాడుతోంది. శ్రీలంక తరువాత ఏ దేశం అంటే వినిపించే పేరు పాకిస్తాన్. అయితే అక్కడ కూడా శ్రీలంక తరహా ఉద్యమం వస్తుందని మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ శనివారం హెచ్చరించారు. మాఫియాకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చే రోజు దగ్గర్లో ఉందంటూ సంచనల వ్యాఖ్యలు చేశారు. ఆసిఫ్ జార్దారీ, షరీఫ్ కుటుంబాలు మూడు నెల్లలోనే తాము అక్రమంగా సంపాదించిన సంపదను కాపాడుకునేందుకు…