Pakistan: ఏ దేశానికైనా సైన్యం, దేశ భద్రతను మాత్రమే పర్యవేక్షిస్తుంటుంది. కానీ, పాకిస్తాన్లో మాత్రం ఇందుకు విరుద్ధమైన పరిస్థితులు ఉంటాయి. సైన్యం ఏం చేయకూడదో, అన్ని పనులను పాకిస్తాన్ మిలిటరీ చేస్తుంటుంది. వ్యవసాయం దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ దాకా చాలా రంగాలు పాక్ సైన్యం చేతిలో ఉన్నాయి. నిజం చెప్పలంటే పాక్ అంటే సైన్యం, సైన్యం అంటే పాక్. తాజాగా, పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు ఆ దేశ జాతీయ ఎయిర్ లైన్స్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది.
Saudi-Pakistan: భారత్, ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో చావు దెబ్బలు, ఆర్థిక సంక్షోభం, అంతర్గత సమస్యలతో పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతోంది. ఈ సమస్యల నుంచి బయటపడాలని దాయాది భావిస్తోంది. ఈ నేపథ్యంలో తన సైన్యాన్ని ఆధునీకీకరించుకోవాలని భావించడంతో పాటు పెట్టుబడుల వేటను కొనసాగిస్తోంది. ఇలాంటి సమయంలోనే సౌదీ అరేబియా రూపంలో ఓ ఆశ పాకిస్తాన్‌కు చిగురించింది. డబ్బు కోసం ఎలాంటి పనులు చేయడానికైనా ఇప్పుడు ఆ దేశం సిద్ధంగా ఉంది. ఇటీవల, సౌదీ అరేబియాతో పాకిస్తాన్ రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఏ…
Asim Munir nuclear threat: అమెరికా పర్యటనలో పాక్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ అణు బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసింది. ఇటీవల అమెరికాలో ప్రవాస పాకిస్థానీయులతో జరిగిన సమావేశంలో పాక్ ఆర్మీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలో నిలిచిన సంగతి విదితమే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో అసలు ఎందుకు ఆయకు ఇంత బలుపు అని చర్చించుకుంటున్నారు. ఏంటి ఆయన కెపాసిటీ.. ఆయన వ్యాఖ్యల వెనుక ఉద్దేశాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ MORE:…
Pakistan: ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదం, రాజకీయ అస్థిరత ఇలా అనేక కారణాలతో పాకిస్తాన్ సతమవుతోంది. పూర్తిగా వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అయిన పాకిస్తాన్లో కొద్దోగొప్పో ఉన్న టెక్నాలజీ కంపెనీలు కూడా తమ కార్యాలయాలను మూసేస్తున్నాయి. టెక్ దిగ్గజం ‘‘మైక్రోసాఫ్ట్’’ జూలై 3, 2025 నుంచి పాకిస్తాన్ నుంచి నిష్క్రమించింది.
Operation Sindoor Effect: భారత్ చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” కారణంగా పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి దిగజారింది. ఈ దాడుల వల్ల పాకిస్తాన్ లో స్టాక్ మార్కెట్లు దారుణంగా కుప్పకూలాయి. దీనితో ఒక్కసారిగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవహారాల శాఖ తన అధికారిక X ఖాతా ద్వారా అంతర్జాతీయ భాగస్వాములకు అప్పుల కోసం విజ్ఞప్తి చేసింది. ఈ ట్వీట్లో.. ప్రతికూల శత్రు దాడుల వల్ల భారీ నష్టాలు ఎదుర్కొన్నాం. యుద్ధ…
పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ఇప్పటికే దారుణంగా ఉంది. తీవ్ర నగదు కొరత, ఆర్థిక సంక్షోభంతో తల్లడిల్లుతోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పలు ఆంక్షలు విధించడంతో పాక్ పరిస్థితి మరింత దిగజారింది. భారత్‌తో ఖయ్యానికి కాలు దువ్వుతున్న తరుణంలో ఆ దేశ ద్రవ్యోల్బణం కొండెక్కింది. ఇప్పటికే ఆహార పదార్ధాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ చికెన్ ధర దాదాపు రూ. 800లకు చేరుకుంది. పాక్ ప్రజలు దారిద్ర్యం అనుభవిస్తున్నారు. ముందు ఇల్లు చక్కబెట్టుకోవడం మర్చిపోయి భారత్‌పై కారాలు మిరియాలు…
దక్షిణ కశ్మీర్‌లోని పహల్గామ్లోని బైసారన్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించారు. ఈ ఉగ్రవాద దాడి తర్వాత, భారతదేశం, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. దాడి తర్వాత భారతదేశం కఠిన చర్యలు తీసుకుంది. సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయడంతో సహా అనేక ఆంక్షలు విధించింది. భారతదేశం తీసుకున్న పెద్ద నిర్ణయాల తర్వాత.. పాకిస్థాన్ కూడా నిరంతరం బెదిరింపులు జారీ చేస్తోంది. బయటకు హెచ్చరికలు చేసినా.. నిజానికి పాకిస్థాన్ లోలోపల వణుకుతోంది.…
Pakistan: పాకిస్తాన్‌తో పాటు దాని జాతీయ విమానయాన సంస్థ ‘‘పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(PIA)’’ కూడా తీవ్ర అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో PIAని విక్రయించాలని చూస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వం. అయితే, దీనిని కొనుగోలు చేసేందుకు ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. దీనిని బట్టి చూస్తే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కరాచీలో శుక్రవారం డ్రీమ్ బజార్ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరగాల్సింది, అయితే షాప్ ఒపెనింగ్ అంతలోనే గందరగోళంగా మారింది. తక్కువ ధరలకే వస్తువులు వస్తాయని షాప్ యాజమాన్యం ప్రకటనలతో అదరగొట్టింది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఓపెనింగ్‌కి హాజరయ్యారు. పాకిస్తాన్ మొట్టమొదటి మెగా పొదుపు దుకాణంగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.
Pakistan: ఆర్థిక సంక్షోభంలో దాయాది దేశం పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతోంది. అక్కడి ప్రజలకు తిందామంటే గోధుమ పిండి దొరకని పరిస్థితి ఉంది. అయితే, ఇలాంటి సమయంలో ఆ దేశ ప్రభుత్వం ఎలుకలను పట్టేందుకు లక్షల్లో డబ్బు ఖర్చు చేయడాన్ని అక్కడి ప్రజలు విమర్శిస్తున్నారు. పాకిస్తాన్ పార్లమెంట్ హౌజులో ఎలుకల సంచారం పెరగడంతో వాటిని అరికట్టేందుకు, పిల్లులను రంగంలోకి దించారు. దీని కోసం పాక్ ప్రభుత్వం ఏకంగా రూ. 1.2 మిలియన్లనను కేటాయించింది.