Pakistan: పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతూ దివాళా అంచుకు చేరుకుంటోంది. కానీ ఆ దేశ సైన్యం మాత్రం ఏదో ఒక హడావిడి చేస్తూనే ఉంది. మాట మాట్లాడితే తమ వద్ద అణుబాంబులు ఉన్నాయని భయపెడుతుంది తప్పితే.. అక్కడి ప్రజల ఆకలిని మాత్రం తీర్చలేకపోతోంది. ఉగ్రవాద దేశంగా ముద్ర పడిన పాకిస్తాన్, నానాటికి ప్రపంచంలో ఒంటరిగా మారుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తన ఆల్ వెదర్ ఫ్రెండ్ చైనా కూడా ప్రస్తుతం ముహం చాటేస్తోంది. ఇన్నాళ్లు పాకిస్తాన్ కు…
Pakistan Economic Crisis: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్, ఐఎంఎఫ్ బెయిలౌట్ సాయంతో బయటపడవచ్చని భావించింది. ఇప్పటికే మిత్రదేశాలు అప్పు ఇవ్వలేమని చెప్పడంతో చివరి అవకాశంగా ఐఎంఎఫ్ తో గత పది రోజుల నుంచి పాక్ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఐఎంఎఫ్ ఇచ్చే ఆర్థిక సాయంతో బయటపడవచ్చని భావించింది. అయితే ఐఎంఎఫ్ తో పాక్ ప్రభుత్వం చర్చలు విఫలం అయినట్లు అక్కడి మీడియా చెబుతోంది.
భవిష్యత్తులో ఇంధనాన్ని అధిక ధరలకు విక్రయించాలనే లక్ష్యంతో కొందరు ఫిల్లింగ్ స్టేషన్ల యజమానులు హోర్డింగ్‌కు పాల్పడుతున్నారని, కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని పాకిస్తాన్ పెట్రోలియం శాఖ సహాయ మంత్రి ముసాదిక్ మాలిక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Pakistan Economic Crisis: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ పతనం అంచుకు చేరుకుంది. అక్కడి ప్రజలకు నిత్యావసరాలు లభించడం లేదు. పిండి, వంటనూనెలు, నెయ్యి, వంట గ్యాస్, కరెంట్ ఇలా అన్నింటా కొరతే. ద్రవ్యోల్భణం ఆల్ టైం హైకి చేరుకుంది. దీంతో నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. అయితే అక్కడి నాయకులు మాత్రం ఆర్థిక సంక్షోభానికి వింతవింత పరిష్కారాలు చూపిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్న ఓ మంత్రి పాకిస్తాన్ ను ఇస్లాం పేరుమీద అల్లా సృష్టించాడని..ప్రజలను కూడా…
Pakistan Economic Crisis: దాయాది దేశం పాకిస్తాన్ పతనం అంచున ఉంది. కేవలం మూడు వారాలకు మాత్రమే విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. ఏడాది క్రితం 16.6 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉంటే ప్రస్తుతం కేవలం 3.1 బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్న ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీ కోసం ప్రయత్నిస్తోంది. ఐఎంఎఫ్ విధించే అన్ని షరతులకు తలొగ్గుతోంది. 7 బిలియన్ డాలర్ల నిధుల కోసం ఐఎంఎఫ్…
Pakistan Economic Crisis: తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతోంది దాయాది దేశం పాకిస్తాన్. మిత్రదేశాలను అడిగినా అప్పు పుట్టడం లేదు. ఇప్పటికే చేసిన అప్పులు భారీగా ఉండటంతో అరబ్ దేశాలు, చైనా, ఇతర దేశాలు అప్పులు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. దీంతో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) సహకరిస్తే తప్పా ఈ సంక్షోభం నుంచి పాకిస్తాన్ బయటపడే అవకాశం లభించదు.
Pakistan Economic Crisis: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ పై రోజుకో పిడుగు పడుతోంది. ఇప్పటికే అక్కడ గోధుమ సంక్షోభం నెలకొంది. ప్రజలకు నిత్యాసరం అయిన పిండి అందుబాటులో లేదు. తాజాగా మరో సంక్షోభం కూడా రాబోతున్నట్లు అంచనా వేస్తున్నారు అక్కడి వ్యాపారులు. రానున్న రోజుల్లో దేశంలో నెయ్యి, వంటనూనెల కొరత ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. బ్యాంకులు నిత్యావసరాల దిగుమతి కోసం లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్సీ)లను విడుదల చేయకపోతే పరిస్థితి మరింతగా దిగజారుతుందని అక్కడి మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
Chicken Theft : పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ద్రవ్యోల్బణం ఎంతగా పెరిగిపోయిందంటే ప్రజలకు రెండు పూటలా రొట్టెలు దొరకడం కూడా కష్టంగా మారుతోంది.
pakistan economic crisis: గడ్డి తినైనా మేం అణుబాంబును తయారు చేస్తాం అని 1970ల్లో పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో అన్నాడు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ వద్ద అణు బాంబులు ఉన్నాయి. కానీ తినడానికి తిండి దొరికే పరిస్థితి లేదు. నిజంగా పాకిస్తాన్ ప్రజలు గడ్డి తిని బతికే పరిస్థితి వచ్చింది. పాక్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోబోతోంది. విదేశీమారక నిల్వలు తరిగిపోయాయి. దీంతో ఇక పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజాన్ని అప్పుల కోసం అడుగుతోంది. అయితే భారత్…
Pakistan hit by petrol shortage: ఆర్థికంగా దివాళా అంచున ఉన్న దాయాది దేశం పాకిస్తాన్ ను వరసగా సంక్షోభాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటే ఆ దేశం అప్పుల కోసం అరబ్ దేశాలతో పాటు ఐఎంఎఫ్ ను సంప్రదిస్తోంది. విదేశీమారక నిల్వలు లేక ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకోలేని పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే నిన్నటి వరకు పాకిస్తాన్ ను విద్యుత్ సంక్షోభం కలవరపెడితే.. తాజాగా పెట్రోల్ సంక్షోభం తెరపైకి వచ్చింది. పాకిస్తాన్ లోని పలు ప్రావిన్సులను…