Taliban: బలూచిస్తాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు హైజాక్ ఘటనలో ఆఫ్ఘనినిస్తాన్‌కి చెందిన ఉగ్రవాదుల ప్రమేయం ఉందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. అయితే, పాకిస్తాన్ వాదనల్ని తాలిబన్లు తోసిపుచ్చారు. ‘‘బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని ప్యాసింజర్ రైలుపై జరిగిన దాడిని ఆఫ్ఘనిస్తాన్‌తో ముడిపెడుతూ పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి చేసిన నిరాధారమైన ఆరోపణలను మేము నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నాము.
Pakistan : పాకిస్తానీ ఉగ్రవాదులకు సోమవారం అంటే చావుదినం లాంటిది. ఇప్పుడు సోమవారం రాగానే ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుడుతుంది. తమకు సురక్షితమైన స్థలం కోసం వెతకడం ప్రారంభించినట్లు కనిపిస్తుంది.
LOC : పూంచ్ జిల్లాలోని బాలకోట్ సెక్టార్‌లోని భారత సైనిక స్థావరాలపై పాకిస్తాన్ సైన్యం నిన్న కాల్పులు జరిపింది. దీనికి ప్రతిస్పందనగా భారత సైన్యం కూడా పాకిస్తాన్ పోస్టులపై కాల్పులు జరిపి తగిన సమాధానం ఇచ్చింది.
Pakistan: పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్ కాల్పులతో దద్దరిల్లుతోంది. ఉగ్రవాదులకు, సైన్యానికి జరిగిన ఘర్షణల్లో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. ఈ ఘర్షణల్లో 18 మంది భద్రతా సిబ్బంది, 12 మంది ఉగ్రవాదులు మరణించినట్లుగా తెలుస్తోంది. జనవరి 31-ఫిబ్రవరి 1 రాత్రి సమయంలో ప్రావిన్స్‌లోని కలాట్ జిల్లాలోని మంగోచార్ ప్రాంతంలో రోడ్డుని ఉగ్రవాదులు దిగ్భందించడంతో ఈ సంఘటన జరిగిందని పాక్ సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది.
Bangladesh: పాకిస్తాన్ సైన్యం అరాచకాల నుంచి రక్షించి బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహకరించిన భారత్ ఇప్పుడు, ఆ దేశానికి శత్రువుగా మారింది. అనేక అరాచకాలు చేసిన పాకిస్తాన్, ఇప్పుడు బంగ్లాదేశ్‌కి స్నేహితుడయ్యాడు. ఎప్పుడైతే షేక్ హసీనా పదవీ నుంచి దించేసి, మహ్మద్ యూనస్ అధికారం చేపట్టాడో అప్పటి నుంచి బంగ్లా వ్యాప్తంగా భారత వ్యతిరేకత నానాటికి పెరుగుతోంది. హిందువులపై అరాచకాలు చేస్తూ, మరో పాకిస్తాన్‌గా మారేందుకు బంగ్లాదేశ్ సిద్ధమవుతోంది.
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ రణరంగాన్ని తలపిస్తోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు రాజధాని ఇస్లామాబాద్ మార్చ్‌కి పిలుపునిచ్చారు. భారీ సంఖ్యలో నిరసనకారులు ఇస్లామాబాద్‌కి చేరుకోవడంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ ఘర్షణల్లో నలుగురు పోలీసులు, ఒక పౌరుడు మరణించాడు. ఇదిలా ఉంటే, పరిస్థితిని చక్కదిద్దేందుకు జోక్యం చేసుకోవాలని ప్రభుత్వం పాక్ ఆర్మీని కోరింది.
Pakistan: పాకిస్తాన్‌ని వణికిస్తున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)పై సైనిక చర్యలకు ఆ దేశం సిద్ధమైంది. పాకిస్తాన్లో అత్యంత పెద్దదైన బలూచిస్తాన్ ప్రావిన్సుని స్వతంత్ర దేశంగా మార్చాలని బీఎల్ఏ పోరాడుతోంది. ఈ వేర్పాటువాద గ్రూపుపై సైనిక దాడిని ప్రారంభించే ప్రణాళికను పాకిస్తాన్ అధికారులు ప్రకటించారు.
భారత్, పాకిస్థాన్‌లు రెండూ అణ్వాయుధాలు కలిగిన దేశాలు. అణ్వాయుధాలు కలిగి ఉన్నప్పటికీ భారతదేశం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుండగా.. పాకిస్థాన్ సైన్యం, దాని ఉన్నతాధికారులు మాత్రం రెచ్చిపోతున్నారు.
ISI: పాకిస్తాన్ గూఢచార ఎజెన్సీ ‘‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)’’ కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మాలిక్ నియమితులైనట్లు పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. సెప్టెంబర్ 30న మాలిక్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. పాకిస్తాన్లో ప్రభుత్వం కన్నా అత్యంత శక్తివంతమైన విభాగం ఆ దేశ సైన్యం. సైన్యాధ్యక్షుడి తర్వాత అంతటి శక్తివంతమైన వ్యక్తిగా ఐఎస్ఐ చీఫ్‌ని భావిస్తారు. ఈయన పాకిస్తాన్లో నెంబర్ 2గా ఉంటారు.
Pakistan : పాకిస్థాన్‌లోని మీర్ అలీ ప్రాంతంలో ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఏ-తాలిబాన్ (టీటీపీ) ఉగ్రవాదులకు, పాక్ ఆర్మీకి మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ హింసాత్మక ఘర్షణ స్థానిక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది.