పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఆరుగురు పాక్ సైనికులు మరణించారు. రాత్రి అకస్మాత్తుగా జరిగిన ఈ ఉగ్రదాడిలో దాదాపు 11 మంది సైనికులు గాయపడినట్లు సమాచారం. ఈ దాడుల్లో 12 మంది ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) ఈ దాడికి పాల్పడింది.
పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో విద్యార్థుల నిరసనలు ప్రభుత్వాన్ని కూల్చేశాయి. షేక్ హసీనా ప్రభుత్వాన్ని చిన్నభిన్నం చేశాయి. ప్రధాని దేశం నుంచి పారిపోయే పరిస్థితి ఏర్పడింది.
ముస్లిం మెజారిటీ దేశమైన పాకిస్థాన్ లో ఓ మహిళకు అరుదైన గౌరవం లభించింది. పాక్ లో మెడికల్ కార్ప్స్లో పనిచేస్తున్న డాక్టర్ హెలెన్ మేరీ రాబర్ట్స్ బ్రిగేడియర్ ర్యాంక్ సాధించిన క్రైస్తవ, మైనారిటీ కమ్యూనిటీ నుంచి మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు.
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో తనలాంటి రాజకీయ నాయకులు జైల్లో మగ్గుతున్న దుస్థితిపై విచారం వ్యక్తం చేశారు. పాక్ ఆర్మీకి తనను చంపడమే మిగిలి ఉందని వ్యాఖ్యానించారు.
Pakistan : పాకిస్థాన్‌లో ఇప్పటి వరకు చిన్నారులపై లైంగిక దోపిడీ, అత్యాచారానికి సంబంధించిన అతిపెద్ద కేసు వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్‌లోని ఖైబర్-పఖ్తున్ఖ్వా ప్రాంతంలో పాకిస్థాన్ సైన్యం చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం.
Pakistan: పాకిస్తాన్లో ప్రజాప్రభుత్వం, ప్రజాస్వామ్యం అనేవి బయటకు కనిపించినా, అక్కడ అంతా సైనిక జోక్యమే ఎక్కువ. సైన్యం చెప్పినట్లే ప్రభుత్వం నడుచుకోవాలి.
పాకిస్థాన్ సైన్యం ప్రస్తుతం సొంత ప్రజలపైనే అకృత్యాలకు పాల్పడుతోంది. ఈసారి పాక్ ఆర్మీ క్రూరత్వానికి బలి అయినది మరెవరో కాదు.. సొంత దేశ పోలీసులే. పాకిస్థాన్ సైన్యం పంజాబ్ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి అక్కడ ఉంచిన పోలీసులను కొట్టి రక్తస్రావం చేసింది.
పాకిస్థాన్ ఎన్నికలు (Pakistan Elections) ఎంత గందరగోళంగా జరిగాయో ప్రపంచమంతటికీ తెలిసిందే. ఎన్నికలు జరగడం ఒకెత్తు అయితే.. ఆ తర్వాత టెస్టు మ్యాచ్‌లా ఫలితాలు విడుదల కావడం మరొకెత్తు.
ఇమ్రాన్ ఖాన్‌తో సైన్యం పరోక్షంగా చర్చలు జరిపినట్లు నాకు సమాచారం ఉంది.. ఇమ్రాన్ ఖాన్ కు సైన్యం పంపిన సందేశంలో.. మే 9 నాటి హింసకు కుట్ర పన్నినట్లు అంగీకరించాలని పేర్కొంది.
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం బయటకు మాత్రమే కనిపిస్తుంది, లోపల అంతా నడిపేది, నడిపించేది ఆ దేశ ఆర్మీ, ఐఎస్ఐ అనేది అందరికి తెలిసిన విషయమే. ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదం, వేర్పాటువాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఆ దేశంలో ఎన్నికలు జరిగాయి. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించడంతో పాటు అతడి పార్టీ సింబర్ రద్దు చేసిన సమయంలో ఈ ఎన్నికలు జరిగాయి. అయితే, ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ పార్టీ పాక్…