భారత సరిహద్దు భద్రతా దళానికి చెందిన జవాను పూర్ణం సాహూ ఇటీవల పొరబాటుగా సరిహద్దు దాటి పాక్ సైన్యానికి చిక్కిన సంగతి తెలిసిందే. ఆ జవానును పాక్ బంధీగా చేసుకుంది. సైనికుడు తమ భూభాగంలోకి రావడం వల్లే అదుపులోకి తీసుకున్నట్లు పాక్ ఆర్మీ వెల్లడించింది. అయితే పాకిస్థాన్ వ్యాఖ్యలను బీఎస్ఎఫ్ అధికారులు తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటన జరిగి 85 గంటలకు పైగా గడిచినా, సైనికుడిని తిరిగి ఇవ్వడంపై పాకిస్థాన్ నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాలేదు. ఇంతలో పశ్చిమ బెంగాల్‌లోని సైనికుడి కుటుంబం తీవ్ర ఆందోళన చెందుతోంది. జవాన్ తండ్రి తన కొడుకు భద్రత గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
READ MORE: Simran : ఇండస్ట్రీలో ఇద్దరు హీరోయిన్స్ ఎప్పటికీ స్నేహితులు కాలేరు..
మరోవైపు, ఆ సైనికుడిని తిరిగి తీసుకురావడానికి బీఎస్‌ఎఫ్ అధికారులు ఇప్పటివరకు మూడుసార్లు పాకిస్థాన్ రేంజర్స్‌తో ఫ్లాగ్ సమావేశాలు నిర్వహించారు. అయినప్పటికీ.. పాకిస్థాన్ నిరంతరం జాప్యం చేస్తూ.. సైనికుడిని అప్పగించడానికి నిరాకరిస్తోంది. సైనికుడిని సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి బీఎస్‌ఎఫ్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అధికారులు పాకిస్థాన్ సహచరులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.
READ MORE: KKR vs PBKS: ఐపీఎల్ 2025లో మొదటిసారి.. నాలుగో స్థానానికి పీబీకేఎస్!
అసలు ఏం జరిగిందంటే?
బీఎస్‌ఎఫ్ 182వ బెటాలియన్ జవాను అయిన పూర్ణం.. పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్ సెక్టార్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. బుధవారం సరిహద్దు వద్ద కొంతమంది రైతులకు రక్షణగా గస్తీ కాస్తుండగా ఆయన కాస్త అస్వస్థతకు గురయ్యారు. సమీపంలో ఓ చెట్టు కనబడటంతో దాని కింద విశ్రాంతి తీసుకున్నారు. అయితే, అది పాక్ భూభాగం అన్న విషయాన్ని గుర్తించలేకపోయారు. సరిహద్దు దాటి రావడంతో పాకిస్థాన్ రేంజర్స్ ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు.