LoC: భారత్‌ని కవ్వించి పాకిస్తాన్ ఆర్మీ మూల్యం చెల్లించుకుంది. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి పాకిస్తాన్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. ఎల్ఓసీని దాటే ప్రయత్నం చేసినట్లు భారత ఆర్మీ చెప్పింది. పాక్ ఆర్మీ కాల్పులకు భారత ఆర్మీ ధీటుగా బదులిచ్చింది. ఈ కాల్పుల్లో 4-5 మంది చొరబాటుదారులను హతమార్చినట్లు ఇండియన్ ఆర్మీ వర్గాలు చెప్పాయి. పూంచ్ జిల్లాలోని కృష్ణ ఘాటి ప్రాంతంలో చొరబాటు ప్రయత్నాన్ని విజయవంతంగా తిప్పికొట్టామని సైన్యం తెలిపింది.
మంగళవారం, పాకిస్తాన్ సైనికులు, చొరబాటుదారులు కాల్పులు జరపడంపై భారత్ సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ వైపు భారీ ప్రాణనష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఇటీవల కాలంలో పాకిస్తాన్ కాల్పులు విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కృష్ణ ఘాటి సెక్టార్‌లో ఇలాంటి కాల్పుల ఘటన ఎదురైంది. అయితే, ఈ చొరబాటులను, పాక్ కవ్వింపులను భారత ఆర్మీ ధాటిగా తిప్పికొట్టింది. భారత్ వైపు నుంచి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని పేర్కొంది.
Read Also: Vikarabad: కాల్వలో మహిళ మృతదేహం.. గుర్తు పట్టకుండ ముఖం కాల్చి..
ఎల్ఓసీ వెంబడి కాల్పుల సంఘటనలు పెరిగే అవకాశం..
గత రెండు నెలలుగా దక్షిణ పిర్ పంజాల్ ప్రాంతొంలో ఎల్ఓసీ వెంబడి సరిహద్దు కాల్పుల సంఘటనలు గణనీయంగా పెరిగాయి. పాకిస్తాన్ స్నిపింగ్, కాల్పులు, బోర్డర్ యాక్షన్ టీం ప్రయత్నాలు పెరిగినట్లు నివేదికలు వస్తున్నాయి. పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుండటాన్ని భారత్ సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. ఆర్మీ వర్గాల ప్రకారం, పాకిస్తాన్ దళాలు, పాక్ ఉగ్రవాదుల్ని భారత్‌లోకి చొప్పించడానికి ప్రయత్నిస్తోంది. పాక్ అంతర్గత సమస్యల నుంచి అక్కడి ప్రజల దృష్టిని మళ్లించేందుకు భారత్‌లో ఏదైనా దాడి చేయాలనే ఉద్దేశంలోనే పాక్ ఉగ్రవాదుల్ని ప్రేరేపిస్తోంది. వీరిని సరిహద్దు దాటించేందుకు, భారత సైన్యం దృష్టిని మళ్లించేందుకు సరిహద్దు వెంబడి కాల్పులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.