Ustaad Bhagat Singh: “అన్నయ్య పక్కన ఉంటే నేను హీరో అన్న సంగతే మర్చిపోతాను” – పవన్ కళ్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ustaad Bhagat Singh: తెలుగు సినీ పరిశ్రమలో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఆదివారం నిర్వహించిన ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ తన అన్నయ్యపై ఉన్న అపారమైన గౌరవాన్ని చాటుకుంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
నాకు ఉన్న ఒకే ఒక్క హీరో చిరంజీవి..
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తనకు ఎప్పటికీ, ఎన్ని సందర్భాల్లోనైనా తన వరకు ఉన్న ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి గారేనని స్పష్టం చేశారు. తనను ఎవరైనా మెచ్చుకుంటున్నా, ఆ ప్రశంసల వెనుక తన అన్నయ్య స్పూర్తి ఉందని చెప్పారు. ఆయన ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంటూ, ” ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి గారిని పిలుద్దాం అని హరీష్ శంకర్ అడిగారని, దానికి నేను మీకు ఒక హీరో కావాలంటే నన్ను పిలవండి, కానీ ఒక తమ్ముడు కావాలంటే చిరంజీవి గారిని పిలవండి” అని చెప్పినట్లు తెలిపారు. చిరంజీవి గారు పక్కన ఉన్నప్పుడు తాను ఒక స్టార్ హీరో అన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోతానని, కేవలం ఒక తమ్ముడిలాగే ఉంటానని ఆయన చెప్పుకొచ్చారు. అన్నయ్య ముందు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదని వివరించారు.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్‌పై చిరంజీవి ప్రశంసలు
పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను చూసి మెగాస్టార్ చిరంజీవి అభినందిస్తూ ట్వీట్ చేయడంపై పవన్ సంతోషం వ్యక్తం చేశారు. తన సినిమాపై అన్నయ్య చూపించిన ఆదరణకు, మనస్ఫూర్తిగా చేసిన ప్రశంసలకు ఈ వేదిక ద్వారా పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సూత్రానికి పవన్ కళ్యాణ్ నిదర్శనమని, అన్నయ్య పట్ల ఆయనకు ఉన్న ఈ విధేయత మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!