Pakistan: పాకిస్తాన్‌కు పెద్ద కష్టమే వచ్చింది. పాక్ కొత్త సైన్యాధిపతి అసిమ్ మునీర్‌కు ముందు నుయ్యి, వెనక గొయ్యిగా ఉంది పరిస్థితి. గాజాకు స్థిరీకరణ దళాలకు పాకిస్తా్న్ తన సైన్యాన్ని పంపించాలని అమెరికా నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఒక పాకిస్తాన్ తన సైన్యాన్ని గాజాకు పంపితే సొంత దేశంలోనే తీవ్ర వ్యతిరేకత వస్తుంది. పాక్ ప్రజలు అమెరికా, ఇజ్రాయిల్‌లను బద్ధ శత్రువుగా భావిస్తారు. పాలస్తీనాకు మద్దతుగా నిలుస్తారు. ఒక వేళ తన సైన్యాన్ని పాక్ పంపించకపోతే అమెరికా…
Pakistan: పాకిస్తాన్లో అసిమ్ మునీర్ రాజ్యం నడుస్తోంది. పౌర ప్రభుత్వం ఉన్నప్పటికీ, అంతా మునీర్ కనుసన్నల్లోనే పాలన ఉంటోంది. ఇటీవల, పాక్ త్రివిధ దళాలకు అధిపతిగా ‘‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(సీడీఎఫ్)’’ పదవిని స్వీకరించారు. దీని తర్వాత, పాకిస్తాన్ అధ్యక్షుడికి సమానంగా,
Pakistan: నిత్యం అబద్ధాలు, అనవసరపు ప్రగల్భాలు పలికే పాకిస్తాన్ నుంచి ఇంతకు మించి ఏం ఆశించగలం. తాజాగా, ఒక ప్రెస్ మీట్లో పాకిస్తాన్ సైన్యం ప్రతినిధి మహిళా జర్నలిస్టును చూసి ‘‘కన్నుకొట్టిన’’ సంఘటన వైరల్‌గా మారింది. పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి విలేకరుల సమావేశంలో మహిళా జర్నలిస్టును చూసి కన్నుగీటుతున్నట్లు చూపించే వీడియో వెలువడిన ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Read Also: Pinaka Mk4 Missile: ఇక…
Pakistan: ఏ దేశానికైనా సైన్యం, దేశ భద్రతను మాత్రమే పర్యవేక్షిస్తుంటుంది. కానీ, పాకిస్తాన్లో మాత్రం ఇందుకు విరుద్ధమైన పరిస్థితులు ఉంటాయి. సైన్యం ఏం చేయకూడదో, అన్ని పనులను పాకిస్తాన్ మిలిటరీ చేస్తుంటుంది. వ్యవసాయం దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ దాకా చాలా రంగాలు పాక్ సైన్యం చేతిలో ఉన్నాయి. నిజం చెప్పలంటే పాక్ అంటే సైన్యం, సైన్యం అంటే పాక్. తాజాగా, పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు ఆ దేశ జాతీయ ఎయిర్ లైన్స్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది.
Pakistan: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ భారతదేశంతో యుద్ధానికి ఆరాపడుతున్నాడని, అయితే ఇమ్రాన్ ఖాన్ భారతదేశంతో, బీజేపీతో స్నేహం చేయడానికి ప్రయత్నించాడని ఇమ్రాన్ సోదరి అలీమా ఖాన్ అన్నారు. స్కై న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ను ‘‘ఇస్లామిక్ కన్జర్వేటివ్’’గా ఆరోపిస్తూ, ఇమ్రాన్ ఖాన్‌ను ‘‘స్వచ్ఛమైన లిబరల్’’గా ఆమె అభివర్ణించారు.
Imran Khan vs Asim Munir: అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. రావల్పిండి అడియాలా జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ హత్య చేయబడినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో పాక్ వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. జైలు అధికారులు, రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌లు మాట్లాడుతూ.. ఇమ్రాన్ ఖాన్ పూర్తి ఆరోగ్యం ఉన్నాడని ప్రకటన ఇవ్వడం కూడా పరిస్థితిని చక్కబడేలా చేయలేదు.
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ జైలులో హత్యకు గురయ్యారని, ఆయనను పాకిస్తాన్ ఆర్మీ హత్య చేసిందనే వార్తలు ఆ దేశంలో సంచలనంగా మారాయి. అవినీతి ఆరోపణలపై 2023 నుంచి రావల్పిండి అడియాలా జైలులో ఇమ్రాన్ ఖాన్ శిక్ష అనుభవిస్తున్నాడు.
Jaish-e-Mohammad: పాకిస్తాన్ ఉగ్ర సంస్థ జైష్-ఏ-మొహమ్మద్(జెఎం) తన మహిళా ఉగ్రవాద విభాగాన్ని ప్రారంభించింది. జమాత్-ఉల్-మోమినాత్ అనే మొదటి మహిళా జిహాదీ విభాగాన్ని ప్రారంభించింది. దీనికి జైషే చీఫ్ మసూద్ అజార్ సోదరి సయీదా అజార్ నాయకురాలిగా బాధ్యతలు స్వీకరించింది.
Pakistan: పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీకి మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, ఆఫ్ఘానిస్తాన్‌తో శత్రుత్వం విషయంలో పాక్ ప్రభుత్వాన్ని కాదని ఆసిమ్ మునీర్ వ్యవరిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా ఆఫ్ఘనిస్తాన్పై దాడుల కోసం పాకిస్తాన్ భూభాగాన్ని ఉపయోగిస్తోందని ఇటీవల తేలింది.
IED Attack Pakistan: వాయువ్య ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఉన్న కుర్రం గిరిజన జిల్లాలోని సుల్తానీ ప్రాంతంలో పాకిస్థాన్ భద్రతా దళాల కాన్వాయ్ లక్ష్యంగా బుధవారం IED పేలుడు దాడి జరిగింది. ఈ దాడిలో కెప్టెన్ సహా ఆరుగురు సైనికులు మరణించినట్లు పాకిస్థాన్ సైన్యం గురువారం ప్రకటించింది. పాకిస్థాన్ సైన్యం మీడియా విభాగం అయిన ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) మరణించిన వారి ఫోటోలను విడుదల చేసింది. బుధవారం కాన్వాయ్ ఆ ప్రాంతం గుండా…