Omar Abdullah: పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడిపై తటస్థ దర్యాప్తునకు తాము సిద్ధంగా ఉన్నామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. దీనిపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా మండిపడ్డారు.
India Pakistan: భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం జీలం నదిలో నీటి మట్టాలు అకస్మాత్తుగా పెరిగాయని పాకిస్తాన్ మీడియా నివేదిస్తోంది. పాక్ అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా భారత్ వైపు నుంచి నీటిని విడుదల చేసినట్లు పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లోని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముజఫరాబాద్‌లో జీలం నీటి మట్టం పెరిగినట్లు చెబుతున్నారు.
Viral Video: పహల్గామ్ దాడిలో 26 మంది అమాయకపు టూరిస్టుల్ని ముష్కరులు పొట్టనపెట్టుకున్నారు. లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ అయిన ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ప్రకటించుకుంది. హిందువుల్ని టార్గెట్ చేస్తూ కాల్చి చంపాడాన్ని యావత్ దేశం ముక్తకంఠంతో ఖండించింది. ఇదిలా ఉంటే, ప్రపంచదేశాలు కూడా భారత్‌కి మద్దతు తెలిపాయి. ఉగ్రవాదం అణిచివేతలో భారత్‌కి సహకరిస్తామని చెప్పింది. Read Also: V. Srinivas Goud: కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ ఆగం చేస్తుంటే బాధ కలుగుతుంది.. ఇదిలా ఉంటే,…
CM Siddaramaiah: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. భారత సైన్యం సర్వం సిద్ధంగా ఉంది. మరోవైపు, పాకిస్తాన్ కూడా ఇండియా నుంచి ఎదురయ్యే దాడిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటిస్తోంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం కాంగ్రెస్ నేత, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
India Pakistan: పహల్గామ్ దారుణమై ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతీ భారతీయుడు కోరుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం, పాకిస్తాన్‌తో అన్ని సంబంధాలను తెంచుకుంటోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇక పాకిస్తాన్‌తో సరిహద్దును మూసేయాలని నిర్ణయించింది. పాకిస్తాన్ జాతీయులకు వీసాలను రద్దు చేసింది. ప్రస్తుతం ఈ నిర్ణయంతో అట్టారీ -వాఘా సరిహద్దులో రద్దీ నెలకొంది. పాక్ జాతీయులు వారి దేశానికి వెళ్లేందుకు బారులు తీరారు.
MIB: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. గత నాలుగు రోజుల నుంచి ఇటు భారత్, అటు పాకిస్తాన్ మీడియా ఛానెళ్లలో ఇదే ప్రధానాంశంగా మారింది. భారత మీడియా మిలిటరీ కార్యకలాపాల గురించి ఎప్పటికప్పుడు నివేదిస్తోంది. ఇదిలా ఉంటే, మిలిటరీ కార్యకలాపాలకు సంబంధించిన కవరేజ్‌ని నిలిపేయాలని శనివారం సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ (MIB) మీడియాకు కీలక ఆదేశాలు జారీ చేసింది
Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఎలాంటి దాడి చేస్తుందో అని పాకిస్తాన్ హడలి చేస్తోంది. బయటకు తన ప్రజల మెప్పు కోసం ఎన్నో బీరాలు పలుకుతున్నప్పటికీ, లోలోపల మాత్రం భయపడుతోంది. ఇప్పటికే, ఆర్థిక దరిద్రంలో పాకిస్తాన్ ఉంది. యుద్ధం చేస్తే ఆ దేశ పరిస్థితి మరింతగా దిగజారుతుందనేది అక్కడి ప్రభుత్వానికి చాలా బాగా తెలుసు. యుద్ధం చేయాల్సి వస్తే, మూడు రోజులకు సరిపడే చమురు నిల్వలు మాత్రమే ఉన్నాయి. మరోవైపు, ఒక వేళ యుద్ధం కోసం…
Pakistan: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది సాధారణ పౌరులు, ముఖ్యంగా మతం ఆధారంగా హిందువుల్ని లక్ష్యంగా చేయడం పట్ల యావత్ దేశం తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది. ఈ మేరకు పాకిస్తాన్‌పై తీవ్ర ప్రతీకారం తీర్చుకోవాలని కేంద్రాన్ని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
తాను పాకిస్థాన్ వెళ్లనని.. తాను ప్రస్తుతం భారతీయ కోడలినని.. తనను ఇక్కడే ఉండనివ్వాలని అని సీమా హైదర్ విజ్ఞప్తి చేసింది. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్థాన్ వీసాలను కేంద్రం రద్దు చేసింది. ఏప్రిల్ 29లోపు అందరూ వెళ్లిపోవాలని ఆదేశాలు ఇచ్చింది.
పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ఆదిల్ అహ్మద్ థోకర్‌కు సంబంధించిన కీలక విషయాలను నిఘా సంస్థలు రాబట్టాయి. పహల్గామ్ ఉగ్రదాడిలో ఆదిల్‌దే కీలక రోల్‌గా భద్రతా సంస్థలు భావిస్తున్నాయి.