BSF jawan: అంతర్జాతీయ సరిహద్దు (IB)ని అనుకోకుండా దాటిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) జవాన్‌ని పాకిస్తాన్ తన అదుపులోకి తీసుకున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ సంఘటన బుధవారం రోజున జరిగింది. 182వ BSF బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ PK సింగ్ అనుకోకుండా సరిహద్దు దాటాడు. ఇండో-పాక్ సరిహద్దుకు సమీపంలోని వ్యవసాయ భూముల్లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో, సాధారణ కదలికల్లో భాగంగా, సింగ్ అనుకోకుండా సరిహద్దు కంచెను దాటి పాకిస్తాన్ వైపు ప్రవేశించాడు.
Simla Agreement: భారత్‌పై పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తూనే ఉంది. పహల్గామ్ దాడి కూడా ఈ కోవకు చెందిందే. లష్కరే తోయిబా అనుబంధ సంస్థకు చెందిన ఉగ్రవాదులు 26 మంది ప్రాణాలు తీసుకున్నారు. దీంతో, భారత్ ప్రతీకార చర్యలకు సిద్ధమైంది. ఇప్పటికే, ‘‘సింధు జలాల ఒప్పందాన్ని’’ భారత్ రద్దు చేసుకుంది. అట్టారీ బోర్డర్‌ని మూసేసింది.పాక్ జాతీయులకు వీసాలను రద్దు చేసింది. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ కూడా భారత్‌పై ప్రతీకార చర్యలు దిగుతోంది. భారత్‌తో వాణిజ్యాన్ని రద్దు చేసుకుంది.…
Pakistan: పాకిస్తాన్, భారత్ చర్యలపై ప్రతీకార చర్యలకు దిగింది. గురువారం పాకిస్తాన్ ‘‘సిమ్లా ఒప్పందం’’ సహా భారత్‌తో ఉన్న అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను నిలుపుదల చేసుకునే హక్కును వినియోగించుకుంటామని తెలిపింది. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అధ్యక్షతన ఈ రోజు జాతీయ భద్రత కమిటీ(ఎన్ఎస్‌సీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆర్మీ అధికారులతో పాటు ఆ దేశంలోని కీలక అధికారులు హాజరయ్యారు.
India: పాకిస్తాన్‌లో ఉన్న భారతీయలు వెంటనే దేశానికి తిరిగి రావాలని భారత ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ దాడి తర్వాత భారతీయులకు కేంద్రం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది.
Visas to Pak: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్‌పై దౌత్య చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటికే ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. పాక్ జాతీయులకు వీసాలను కూడా రద్దు చేస్తు్న్నట్లు బుధవారం భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 27 నుంచి పాక్ జాతీయులకు వీసాలు రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 29 వరకు మాత్రమే వైద్య వీసాలకు అనుమతించింది.
PM Modi: పాకిస్తాన్, దాని ఉగ్రవాదులకు ప్రధాని నరేంద్రమోడీ మాస్ వార్నింగ్ ఇచ్చారు. గురువారం బీహార్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రపంచానికి తెలిసేలా సందేశం ఇచ్చారు. సభలో ఆయన హిందీలో మాట్లాడుతూ, ఒక్కసారిగా ఇంగ్లీష్‌కి మారిపోయారు. ప్రపంచవ్యాప్తంగా తన వార్నింగ్ అర్థమయ్యేలా ఇంగ్లీష్‌లో హెచ్చరికలు పంపారు.
ఇదిలా ఉంటే, భారత్ ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేయడంపై పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. భారత్ తీసుకున్న నిర్ణయాన్ని ‘‘జలయుద్ధం’’గా పేర్కొంది. ఈ చర్యలను చట్టవిరుద్ధమైనవిగా పేర్కొంది. భారత తీరును చట్టబద్ధంగా సవాల్ చేస్తామని, ప్రపంచ బ్యాంక్ వంటి ప్రపంచ సంస్థ మధ్యవర్తిత్వంతో జరిగిన ఒప్పందం నుంచి భారత్ ఏకపక్షంగా నిష్క్రమించలేదని పాకిస్తాన్ తెలిపింది.
Abir Gulaal: పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకపు టూరిస్టులు చనిపోయారు. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ అయిన లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్న ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించింది. మంగళవారం, పహల్గామ్‌లోని బైసరీన్ పచ్చిన మైదానాలు చూస్తున్న టూరిస్టులపై ముష్కరులు దాడి చేశారు.
పహల్గాంలోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. మంగళవారం సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు.. పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఉగ్రదాడికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రదాడి నేపథ్యంలో భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో కూడా పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడే ప్రసక్తే లేదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా…
టీమిండియా క్రికెట్ జట్టు హెడ్ కోచ్, బీజేపీ మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు హత్యా బెదిరింపులు వచ్చాయి. ‘నిన్ను హతమారుస్తాం’ అంటూ ఐసిస్ కశ్మీర్ నుంచి గౌతీకి బెదిరింపులు వచ్చాయి. ‘ఐ కిల్ యూ’ అంటూ తనకు ఈ-మెయిల్స్ వచ్చినట్లు ఢిల్లీ పోలీసులకు గంభీర్ ఫిర్యాదు చేశారు. గంభీర్ ఫిర్యాదు మేరకు రాజీందర్‌నగర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ విషయం గంభీర్ కుటుంబసభ్యులను ఆందోళనకు గురిచేస్తోంది. ఐ కిల్ యూ అంటూ…