Asaduddin Owaisi: జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో టూరిస్టులపై ఉగ్రవాద దాడి తర్వాత దాయాది దేశం పాకిస్తాన్ పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా మండిపడ్డారు. పాకిస్తాన్ సర్కార్, దాని నిఘా సంస్థ ISI యొక్క అక్రమ సంతానమే ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అని ఆరోపించారు.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత దేశమంతా దు:ఖంలో ఉంటే ఉత్తరప్రదేశ్‌కు చెందిన జానపద గాయని నేహా సింగ్ రాథోడ్ మాత్రం దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టింది.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కేంద్ర పెద్దలు భవిష్యత్ కార్యాచరణపై కీలక చర్చలు జరుపుతున్నారు. సోమవారం ఉదయం ప్రధాని మోడీతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ భేటీ అయ్యారు.
పహల్గామ్ ఉగ్ర దాడిని ఖండిస్తూ జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం సురిందర్ చౌదరి తీర్మానం ప్రవేశపెట్టారు. ముక్తకంఠంతో శాసనసభ ఉగ్రదాడిని ఖండించింది.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో నివాసం ఉంటున్న ప్రవాస భారతీయులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. హిందువులకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసపై ప్రపంచ దేశాలు స్పందించాలని డిమాండ్ చేశారు.
పహల్గామ్ ఉగ్ర దాడిపై అంతర్జాతీయ మీడియా పక్షపాతం ప్రదర్శిస్తోంది. పాకిస్థాన్‌కు అనుకూలంగా.. భారత్‌కు వ్యతిరేకంగా కథనాలు ప్రచురిస్తున్నాయి. ఇప్పటికే ది న్యూయార్క్ టైమ్స్ తప్పుడు కథనాన్ని ప్రచురించింది. ఉగ్ర దాడిని మిలిటెంట్ దాడిగా ప్రపంచానికి పరిచయం చేసింది.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన 16 యూట్యూబ్ ఛానల్స్‌పై నిషేధం విధించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫార్సుల మేరకు 16 పాకిస్థానీ యూట్యూబ్ ఛానెల్స్‌పై వేటు పడింది.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్థాన్-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఎల్ఓసీ దగ్గర నిరంతరం కాల్పులకు తెగబడుతోంది