పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత దేశమంతా దు:ఖంలో ఉంటే ఉత్తరప్రదేశ్‌కు చెందిన జానపద గాయని నేహా సింగ్ రాథోడ్ మాత్రం దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టింది. 2019లో పుల్వామా ఉగ్ర దాడిని మోడీ ఎన్నికల అస్త్రంగా ఉపయోగించుకున్నారని.. తాజాగా పహల్గామ్ ఉగ్ర దాడి పేరుతో బీహార్‌లో ఓట్లు అడుగుతున్నారని పోస్టు పెట్టింది. ఈ పోస్టు పాకిస్థానీయులకు అస్త్రంగా మారింది. ఆమె చేసిన పోస్టును పాకిస్థాన్ జర్నలిస్టులు తెగ వైరల్ చేస్తున్నారు. అందరూ రీట్వీట్ చేస్తూ ప్రధాని మోడీని తప్పుగా క్రియేట్ చేస్తున్నారు. భారత్‌లో సొంత ప్రజలే మోడీ తీరును తప్పుపడుతున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Delhi: ప్రధాని మోడీతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కీలక భేటీ.. ఉత్కంఠ రేపుతున్న చర్చలు
పహల్గామ్ ఉగ్ర దాడి కేవలం నిఘా, భద్రతా వైఫల్యం అని ఆమె పేర్కొంది. ప్రధాని మోడీ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలరు గానీ.. సొంత దేశంలో మాత్రం ఉగ్రదాడిని నివారించలేరని ఆరోపించింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై లక్నోలోని హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో అభయ్ ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఆమె ఒక మతాన్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించిందని ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమెపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 124ఏలో పేర్కొన్నట్లుగా బీఎన్ఎస్ దేశద్రోహం కేసు నమోదు చేశారు. అలాగే క్రిమినల్ కోడ్ సెక్షన్ 152 కింద దేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతకు హాని కలిగించినట్లుగా పోలీసులు అభియోగాలు మోపారు.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy : కేసీఆర్‌కు నేను సీఎం అయిన రెండో రోజే గుండె పగిలింది
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్‌తో భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపివేసింది. అంతేకాకుండా పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసింది. అలాగే అటారీ సరిహద్దు మూసివేసింది. తాజాగా పాక్‌కు సంబంధించిన 16 యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం విధించింది. ఇలా ఒక్కొక్కటిగా భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక ఉగ్ర దాడులకు పాల్పడ్డ నిందితుల సమాచారం అందిస్తే రూ.20లక్షల రివార్డ్ ప్రకటించింది. గత మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల కొద్ది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువగా కొత్తగా పెళ్లైన వారు ఉండడం బాధాకరం.
ఇది కూడా చదవండి: Pahalgam Terror Attack: దాడిని ఖండిస్తూ జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం