పహల్గామ్ ఉగ్ర దాడిని ఖండిస్తూ జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆసక్తికర ప్రసంగం చేశారు. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత దేశంలోని ప్రతి ప్రాంతం ఆవేదనకు గురైందన్నారు. ఉత్తరం నుంచి దక్షిణం వరకు.. తూర్పు నుంచి పడమర వరకు ఇలా ప్రతి ప్రాంతం దిగ్భ్రాంతికి గురైందని గుర్తుచేశారు. ఉగ్ర దాడి తర్వాత కాశ్మీర్ అంతా ఐక్యంగా ఉందని గుర్తుచేశారు. ఇక లోయలో ఉగ్రవాదం అంతం కావడం ఖాయమన్నారు.
ఇది కూడా చదవండి: Neha Singh Rathore: దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు.. సింగర్‌పై దేశద్రోహం కేసు
ఇక ఉగ్ర దాడిలో చనిపోయిన 26 మంది పేర్లును సభలో చదివి వినిపించారు. ఈ దాడిలో తండ్రులను కోల్పోయిన పిల్లలకు తాను ఏం సమాధానం చెప్పాలని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం బాధ్యతగా పర్యాటకులను ఆహ్వానించింది.. కానీ వారికి భద్రత కల్పించలేకపోయామన్నారు. క్షమాపణ చెప్పడానికి కూడా మాటలు రావడం లేదని.. తండ్రులను కోల్పోయిన పిల్లలకు గానీ.. భర్తలను కోల్పోయిన వితంతువులకు ఏం సమాధానం చెప్పాలన్నారు. తాము ఏం తప్పు చేశామని వాళ్లంతా అడుగుతున్నారని.. సమాధానం చెప్పలేకపోతున్నామని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ చర్యలకు ప్రతిపక్ష నాయకుడు సునీల్ శర్మ ప్రశంసించారు. అలాగే ఉగ్రవాద దాడిని ఖండించారు. అఖిలపక్ష సమావేశాన్ని పిలిచినందుకు ముఖ్యమంత్రిని, ప్రత్యేక సమావేశాన్ని పిలిచినందుకు అసెంబ్లీ స్పీకర్ అబ్దుల్ రహీం రాథర్‌ను ప్రశంసించారు.
ఇది కూడా చదవండి: Chiranjeevi : ‘ఠాగూర్’ మూవీ జోడి రిపీట్ చేస్తున్న అనిల్ రావిపుడి..!