Operation Sindoor: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో బదులు తీర్చుకుంది. అయితే, భారత్ ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడి చేసినా, పాక్ ఆర్మీ కవ్వించిన సంగతి తెలిసిందే. పాక్ ఆర్మీ భారత జనావాసాలు, సైనిక స్థలాలను టార్గెట్ చేస్తూ, డ్రోన్లతో దాడులు నిర్వహించింది.
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసింది. అతికిరాతకంగా పర్యాటకులను ఉగ్రవాదులు చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. తాజాగా ఎన్ఐఏ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూశాయి. పహల్గాం ఉగ్రవాద దాడిలో కేవలం ముగ్గురు ఉగ్రవాదులు మాత్రమే పాల్గొన్నారని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఇక్కడ మరో సంచలన విషయం ఏమిటంటే ఆ ముగ్గురికి ఆశ్రయం ఇచ్చిన స్థానికులకు వారు రూ.3 వేలు మాత్రమే ఇచ్చారు. వారికి సాయం…
Indus Waters Treaty: జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థాన్‌కు సింధూ జలాలను ఆపేస్తూ.. భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఓ వైపు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, మాజీ మంత్రి బిలావల్ భుట్టో బెదిరింపులకు దిగుతుంటే.. మరోవైపు తమకు నీటిని రిలీజ్ చేయాలంటూ ఆ దేశ విదేశాంగ శాఖ ఇండియాను బతిమిలాడుతుంది. తమ దేశానికి నిలిపివేసిన సింధూ జలాల సరఫరాను తిరిగి పునరుద్ధరించాలని తాజాగా భారత్ ని కోరింది.…
Operation Sindhoor: ఏప్రిల్ 22న పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పడానికి భారత్ ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా భారత్ మే 7 ఉదయం, పాకిస్థాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఇందులో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. ఆపరేషన్ సింధూర్ ప్రారంభంతో ఇరుదేశాల మధ్య ప్రారంభమైన వివాదం దాదాపు 4 రోజుల పాటు కొనసాగి మే…
PM Modi: ప్రధాని తన సొంత నియోజకవర్గం వారణాసిలో శనివారం పర్యటించారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించిన తీరును కొనియాడారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సంబంధించిన ఒక కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రంతా ఆయన మేల్కొని ఉన్నట్లుగా వర్గాలు పేర్కొన్నాయి. అసలేం జరిగింది. ఆయన రాత్రంతా ఎందుకు మేల్కొని ఉండాల్సి వచ్చిందో వర్గాలు పేర్కొన్నాయి.
రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేసిన వాదనలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగంగా ఖండించాలని తాజాగా పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. ఈ అంశంపై మోడీ సమాధానమిచ్చారు. ఆపరేషన్ సిందూర్ ఆపమని ప్రపంచలోని ఏ నాయకుడు మమ్మల్ని అడగలేదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. "మే 9న నాతో మాట్లాడేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రయత్నించారు.
ఆపరేషన్ సిందూర్ పై లోక్‌సభలో చర్చ కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్‌సభకు చేరుకున్నారు. ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో ప్రతిపక్ష నేతల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ వర్షాకాల సమావేశాలు భారత్ విజయ్ ఉత్సవానికి నిదర్శనమన్నారు.. ఆపరేషన్ సిందూర్ విజయానికి ప్రతీకగా విజయ్ ఉత్సవ్.. విజయ్ ఉత్సవ్‌ను దేశం మొత్తం జరుపుకుంటోందని వెల్లడించారు.
ఆపరేషన్ సిందూర్ పై పార్లమెంటు వర్షాకాల సమావేశంలో రెండవ రోజు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సోమవారం కూడా లోక్ సభలో అర్ధరాత్రి 12 గంటల వరకు చర్చించారు. తాజాగా ఈ అంశంపై ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడారు. పహల్గాంలో టూరిస్టులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపారని రాహుల్ గాంధీ అన్నారు.
Priyanka Gandhi’s speech on Operation Sindoor: లోక్‌సభలో ‘ఆపరేషన్ సిందూర్’పై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. పహల్గాం ఉగ్రదాడికి బాధ్యతగా హోంమంత్రి లేదా ఐబీ చీఫ్ లేదా ఇంకెవరన్నా రాజీనామా చేశారా? అని అడిగారు. టీఆర్ఎఫ్ కొత్త సంస్థ ఏం కాదు అని, వరుసగా దాడులు చేస్తుంటే కేంద్రం ఏం చేస్తున్నట్లు? అని మండిపడ్డారు. ప్రతిసారీ నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ వరకు తమ…