మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కల్నల్ సోఫియా ఖురేషిపై విజయ్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి.
భారత సైన్యం సోమవారం భారీ విజయాన్ని సాధించింది. భారతీయులను గాయపరిచిన ముష్కరులను ఆర్మీ మట్టుబెట్టింది. పహల్గామ్లో మారణహోమం సృష్టించిన ముగ్గురు ఉగ్రవాదుల అంతు చూసింది.
Pahalgam terrorists: జమ్మూ కాశ్మీర్లో రెండు నెలల క్రితం అమాయమైన 26 మంది టూరిస్టుల్ని పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ, లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ‘‘ది రెస్టిస్టెంట్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఉగ్రవాదులు చంపేశారు. ప్రకృతి అందాలను చూడటానికి వచ్చిన పర్యాటకుల్ని మతం పేరు అడుగుతూ చంపేశారు. ఈ ఘటన తర్వాత సంఘటనా స్థలం నుంచి పారిపోయారు.
P Chidambaram: పార్లమెంట్లో ఆపరేషన్ సిందూర్ చర్చకు అంతా అధికార, ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. అయితే, దీనికి ముందు కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమువుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో పహల్గామ్ ఉగ్రదాడిలో ‘‘స్వదేశీ ఉగ్రవాదులు’’ పాల్గొనవచ్చని ఆయన అన్నారు. హంతకులు పాకిస్తాన్ నుంచి వచ్చారని నిరూపించే ఆధారాలు ఏక్కడ అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది.
Parliament Sessions: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ రోజు (జూలై 21) నుండి మొదలు కానున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు 21 వరకు నెల రోజుల పాటు కొనసాగనుంది. అయితే, మొదటి రోజు నుంచే సెషన్లో నుండే పలు సమాసాలు చర్చలోకి వచ్చేలా కనిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా విపక్షాలు మోదీ ప్రభుత్వం తలపెట్టిన అంశాలపై గట్టిగా నిలదీసేందుకు వ్యూహాత్మకంగా సిద్ధమయ్యాయి. ఇండియా కూటమిలోని 24 పార్టీల ముఖ్య నేతలు సమావేశమై ప్రధాన సమస్యలపై చర్చించి వ్యూహం చేశారు.…
Pakistan: పాకిస్తాన్‌కు ఉగ్రవాదానికి ఉన్న సంబంధాలను బయటపెట్టుకోవడంలో ఆ దేశం ఎప్పుడూ సిగ్గుపడటం లేదు. తాజాగా, పహల్గామ్ ఉగ్రవాడికి బాధ్యత వహించిన ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)’’కు మద్దతు తెలుపుతోంది. ఏకంగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కామెంట్స్ కొత్త వివాదానికి దారి తీశాయి. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(UNSC)లో నాన్-పర్మినెంట్ సభ్యుడిగా ఉన్న పాకిస్తాన్, పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూనే, ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్ ప్రస్తావనను నిరోధించింది.
Operation Sindoor: పహల్గాం ఉగ్రవాద ఘటన తర్వాత, భారత్ పాకిస్తాన్‌పై ‘‘ఆపరేషన్ సిందూర్’’తో విరుచుకుపడింది. పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించింది. ఇందులో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ హెడ్‌క్వార్టర్స్ అయిని మురిడ్కే, బహవల్పూర్ కూడా ఉన్నాయి. 100 మందికిపైగా టెర్రరిస్టులు ఈ దాడుల్లో హతమయ్యారు. అయితే, ఈ దాడుల తర్వాత పాకిస్తాన్ సైన్యం భారత్‌పైకి దాడులు ప్రారంభించింది. ఈ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది.
పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబాకు చెందిన టీఆర్ఎఫ్ ను ఉగ్రవాద సంస్థగా అమెరికా శుక్రవారం ప్రకటించింది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ మారణహోమానికి టీఆర్ఎఫ్ బాధ్యత వహించింది. యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ టీఆర్ఎఫ్ ను ‘విదేశీ ఉగ్రవాద సంస్థ’ (FTO), ప్రత్యేకంగా నియమించబడిన ‘గ్లోబల్ టెర్రరిస్ట్’ (SDGT)గా ప్రకటించింది. కాశ్మీర్ రెసిస్టెన్స్ అని కూడా పిలువబడే రెసిస్టెన్స్ ఫ్రంట్, లష్కరే తోయిబా అనుబంధ సంస్థగా భావిస్తున్నారు. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ భారత్, పాశ్చాత్య దేశాలలో దాడులకు…
Asaduddin Owaisi: ఏఐఎంఐఎం (AIMIM) అధ్యక్షుడు, పార్లమెంటరీ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి ఘటనపై మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణలోని బోధన్ పట్టణంలో బుధవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. కేంద్ర ఎన్నికల సంఘం బీహార్ ఓటర్ల జాబితాలో బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు, నేపాలీలు ఉన్నట్టు గుర్తించగలగినప్పుడు.. పహల్గాంలో 26 మంది హిందూ పర్యాటకులను దారుణంగా హత్య చేసిన ఉగ్రవాదుల్ని ఎలా కనుగొనలేకపోయారని ప్రశ్నించారు. Work From…
పహల్గామ్ ఉగ్ర దాడి యావత్తు దేశాన్ని కాకుండా ప్రపంచాన్ని కలవరపాటుకు చేసింది. నలుగురు ముష్కరులు తుపాకులతో చెలరేగిపోయారు. మహిళలు, పిల్లల్ని వదిలేసి భర్తలను చంపేశారు. ఇలా 26 మందిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. ఇక ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది.