Shahid Afridi: దుబాయ్ వేదికగా జరిగిన భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌లో పాక్ ఓటమి కన్నా, భారత్ చేసిన అవమానానికే తెగ ఫీల్ అవుతోంది. ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ జట్టు ప్లేయర్లకు, భారత్ ప్లేయర్లు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. ఇది ఇప్పుడు వివాదంగా మారింది. పాకిస్తాన్ దీనిపై గగ్గోలు పెడుతోంది. ఆపరేషన్ సిందూర్‌లో జరిగిన అవమానం కన్నా, ఇప్పుడే పాకిస్తాన్ చాలా బాధపడుతోంది. పాక్ మాజీ ప్లేయర్లు భారత్‌ను ఉద్దేశిస్తూ విమర్శలు చేస్తున్నారు. పాకిస్తాన్‌కు ఇది జరగాల్సిందే అని భారత ప్రజలు అనుకుంటున్నారు.
ఇదిలా ఉంటే, భారత్ మీద ఎప్పుడూ పడిఏడ్చే పాకిస్తాన్ మాజీ ప్లేయర్ షాహిద్ అఫ్రిది మరోసారి వార్తల్లో నిలిచారు. పాక్ ప్లేయర్లతో కరచాలనం చేయకపోవడంపై స్పందించారు. భారత్‌ను విమర్శించారు. ఇదిలా ఉంటే, షాహిద్ అఫ్రిది కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపిస్తూ, మోడీ ప్రభుత్వాన్ని ‘‘హిందూ – ముస్లిం కార్డు ప్లే చేస్తోంది’’ అని ఆరోపించారు. ‘‘ మోడీ ప్రభుత్వం మతం కార్డును ప్లే చేస్తోంది. అధికారంలోకి రావడానికి హిందూ-ముస్లిం కార్డు ప్లే చేస్తోందని నేను పదే పదే చెబుతున్నాను. ఇది చాలా చెడు మనస్తత్వం’’ అని ఆరోపించారు.
Read Also: Priyanka Arul Mohan: పవన్ డిప్యూటీ సీఎం అవ్వక ముందు అలా.. అయ్యాక ఇలా!
బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం ఇలాంటివి కొనసాగుతాయి. రాహుల్ గాంధీ ఈ విధానంతో విభేదించారని, కాంగ్రెస్ ఎంపీ పాకిస్తాన్‌తో సంభాషణను కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ‘‘రాహుల్ గాంధీకి సానుకూల మనస్తత్వం ఉంది. చర్చల ద్వారా ఆయన అందరితో, మొత్తం ప్రపంచంతో కలిసి నడవాలని కోరకుంటున్నారు’’అని ఆఫ్రిది ప్రశంసలు కురిపించారు. ఆసియా కప్‌లో భారత ఆటగాళ్లు, పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి నిరాకరించడంతో వివాదం చెలరేగింది.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, పాక్‌తో సంబంధాలు లేకుండా పోయాయి. నిజానికి ఈ మ్యాచ్‌ని భారత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్నడూ లేనంతగా భారత్-పాక్ మ్యాచ్ అంటే కనీసం ఆసక్తి చూపించలేదు. ‘‘ఆసియా కప్ ప్రారంభమైనప్పుడు, భారత్-పాక్ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియా మొత్తం నిండిపోయింది. ప్రజల ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో, ఆటగాళ్లు, బీసీసీఐ మా జట్టుతో కరచాలనం చేయవద్దని చెప్పడంలో ఆశ్చర్యం లేదు’’ అని ఆఫ్రిది అన్నారు. ‘‘నేను భారత ఆటగాళ్లను తప్పుపట్టడం లేదు, కానీ వారికి పై నుంచి ఆదేశాలు ఉన్నాయి’’ అని అన్నారు.