BJP: ఆసియా కప్ 2025 టోర్నీలో భారత్, దాయాది పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత్ ఆటగాళ్లు పాకిస్తాన్ ప్లేయర్లను కనీసం పట్టించుకోలేదు. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశ ప్లేయర్లకు ‘‘హ్యాండ్ షేక్’’ కూడా మన ప్లేయర్లు ఇవ్వలేదు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ విజయాన్ని ‘‘పహల్గామ్’’ బాధితులకు, భారత సైన్యానికి అంకితమిచ్చారు. అయితే, పాకిస్తాన్ మాత్రం తమకు జరిగిన అవమానానికి తీవ్రంగా రగిలిపోతోంది. ఆ దేశ మాజీ క్రికెటర్లు భారత్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.
Read Also: Pakistan: “ఢిల్లీ నుంచి పాకిస్తాన్‌ను రక్షించేందుకే ఉగ్రవాదం”.. జైషే ఉగ్రవాది ఇలియాస్ కాశ్మీరీ..
భారత్ అంటేనే నిలువెళ్లా విషంకక్కే పాక్ మాజీ ప్లేయర్ షాహిద్ అఫ్రిది, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించారు. అదే విధంగా మోడీ సర్కార్‌ను విమర్శించారు. దీనిపై బీజేపీ ఘాటుగా స్పందించింది. భారత్-పాక్ మ్యాచ్ తర్వాత కరచాలనం చేయడానికి నిరాకరించిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘రాహుల్ గాంధీకి చాలా సానుకూల మనస్తత్వం ఉంది. ఆయన చర్చల ద్వారా అందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలనుకుంటున్నారు. మీకు ఒక ఇజ్రాయిల్ సరిపోదా..? మరొకటిగా తయారు కావడానికి ప్రయత్నిస్తున్నారా..? మోడీ ప్రభుత్వం హిందూ-ముస్లిం మతంకార్డును వాడుకుంటుంది’’ అని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ బండారీ స్పందించారు. ‘‘రాహుల్ గాంధీకి కొత్త అభిమాని వచ్చాడే. ఆయనే షాహిద్ అఫ్రిది’’ అని ఎద్దేవా చేశారు. మరో బీజేపీ నేత షెహజాద్ పూనావాలా కూడా రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. ‘‘ఆశ్చర్యం లేదు. భారతదేశాన్ని ద్వేషించే ప్రతీ ఒక్కరూ రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌లో మిత్రుడిని కనుగొంటారు. సోరోస్ నుంచి షాహిద్ వరకు. INC = ఇస్లామాబాద్ నేషనల్ కాంగ్రెస్. కాంగ్రెస్-పాక్ స్నేహం చాలా పాతది.’’ అని అననారు. ‘‘26/11, పుల్వామా, పహల్గామ్, ఆర్టికల్ 370, సర్జికల్ స్ట్రైక్స్ వరకు-కాంగ్రెస్ ఎల్లప్పుడూ పాకిస్తాన్ కథనాన్ని ప్రతిధ్వనిస్తుంది’’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
After Hafiz Saeed now Shahid Afridi ( Terror apologist & India hater ) praises Rahul Gandhi… Not surprised! Everyone who hates India finds an ally in Rahul Gandhi & Congress
From Soros to Shahid …
INC = Islamabad National Congress
Cong Pak Yaarana is very old
Art 370 to… pic.twitter.com/Od5W7gDcFH— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) September 16, 2025