పహల్గాంలో ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా ఉంది. అయితే అది ఎలా అనే విషయంలోనే భిన్నాభిప్రాయాలున్నాయి. ఇప్పటికే భారత్ వ్యూహాత్మక యుద్దం మొదలుపెట్టింది. కానీ కొందరు సోషల్ మీడియా దేశ భక్తులు మాత్రం పాక్ పై అణుదాడికి దిగాలని ఉచిత సలహాలిస్తున్నారు. ఇంతకూ భారత్ ఏం చేస్తే బాగుంటుంది..? అసలు పాక్ పరిస్థితి ఎలా ఉంది..? అణ్వస్త్రాల విషయంలో దాయాదుల వైఖరేంటి..?
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి మృతుడి భార్యను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా మండిపడింది. ఆమె సైద్ధాంతిక వ్యక్తీకరణను తప్పుపడుతూ ట్రోల్ చేయడం మంచిది కాదని తెలిపింది.
బైసారన్ లోయలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఒక నేపాలీ జాతీయుడితో సహా ఇరవై ఆరు మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన టెర్రరిస్టులను పట్టుకునేందుకు భారత భద్రతా దళాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఈ ఘోరమైన కాల్పులకు పాల్పిన ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఉన్నత సైనిక శిక్షణ పొందారని నిఘా వర్గాలు తెలిపాయి.
Terrorist: జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ దాడి విచారణలో కుల్గాంకు చెందిన ఇంతియాజ్ మహ్మద్ లష్కరే తోయిబా స్లీపర్ సెల్ సభ్యుడిగా అనుమానించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఉగ్ర దాడికి సంబంధించి జరిపిన దర్యాప్తులో ఇంతియాజ్ పాత్ర బయటపడిందని అన్నారు.
Islam- Terrorism: ప్రపంచ దేశాల్లో ఇస్లాం ఉన్నంత వరకూ ఉగ్రవాదం బ్రతికే ఉంటుందని బంగ్లాదేశ్ బహిష్కృత రచయిత తస్లీమా నస్రీన్ తెలిపారు. పహల్గాం దాడిని, 2016లో ఢాకాలో జరిగిన ఉగ్రదాడితో పోల్చారు.
Blackout Drill: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో, ఇండియా పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఈ ఉద్రిక్తతల నడుమ పంజాబ్లోని ఫిరోజ్పూర్ ఆర్మీ కంటోన్మెంట్లో ఆదివారం రాత్రి ‘‘బ్లాక్అవుట్ డ్రిల్’’ నిర్వహించారు. పూర్తిగా లైట్లు ఆర్పేసి, ఎలాంటి వెలుతురు లేకుండా సైన్యం ఈ వ్యాయామంలో పాల్గొంది. తన యుద్ధ సన్నద్ధతను పరీక్షించుకుంది. బ్లాక్అవుట్ డ్రిల్ సక్సెస్ కావడానికి ఫిరోజ్పూర్ కంటోన్మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఫిరోజ్పూర్ డిప్యూటీ కమిషన్ మద్దతు, సహకారాన్ని కోరారు. డ్రిల్…
India Pakistan War: పహల్గామ్ ఉగ్రదాడి దాయాదుల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాకిస్తాన్ రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు మాత్రం మేము భారత్ని ధీటుగా ఎదుర్కొంటామని బీరాలు పలుకున్నారు. తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు, ఎంత గంభీరంగా బయటకి కనిపిస్తున్నా, పాక్ నాయకత్వంలో భారత్ అంటే భయం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే, బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా వంటి సంక్షోభ ప్రాంతాల నుంచి…
Rajnath Singh: 26 మంది ప్రాణాలను బలితీసుకున్న ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’తో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకున్నాయి. ఈ దాడి వెనక పాక్కి చెందిన లష్కరే తోయిబా ఉగ్రసంస్థతో పాటు పాక్ ఆర్మీ, ఐఎస్ఐ ఉన్నట్లు తెలిసింది. అయితే, ఈ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని సగటు భారతీయులు కోరుకుంటున్నాడు. ఇప్పటికే పాకిస్తాన్పై దౌత్య చర్యలు, ఆర్థిక చర్యలు ప్రారంభమయ్యాయి. త్వరలోనే సైనిక చర్యలు కూడా ఉంటాయనే వార్తలు వినిపిస్తున్నాయి. వరసగా ప్రధాని మోడీ, టాప్…
India Pakistan Tension: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అయితే, ఈ భారత్ తీసుకుంటున్న నిర్ణయాలతో పాకిస్తాన్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ అన్నారు. ప్రధాని మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే భయంతో పాకిస్తాన్ మంత్రులు, ఆర్మీ జనరల్స్ దేశం విడిచి పారిపోయేందుకు టిక్కెట్లు బుక్ చేసుకున్నారని ఆరోపించారు.
CRPF Man: పాకిస్తాన్ మహిళతో తన వివాహాన్ని దాచిపెట్టడం, వీసా ముగిసినా కూడా ఆశ్రయం కల్పించిన కారణంగా సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మునీర్ అహ్మద్ తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఉద్యోగం నుంచి తీసేస్తూ నిన్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఉత్తర్వులు జారీ చేసింది.