India Pakistan: పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అయితే, పాకిస్తాన్ నాయకులు మాత్రం రోజుకో ప్రకటన చేస్తూ, రెండు దేశాల మధ్య మరింత ఉద్రిక్తతను పెంచుతున్నారు. తాజాగా, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. సింధు నదిపై భారతదేశం నిర్మించిన ఏ నిర్మాణాన్నైనా కూల్చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. సింధు నది ఒప్పందం ప్రకారం, పాకిస్తాన్‌కి రావాల్సిన నీటిని వాటాను మళ్లించడానికి భారత్ ఏ డ్యాముని నిర్మించినా కూల్చేస్తామని అన్నారు.
Read Also: PM Modi: భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య, ఉగ్రవాదులకు మోడీ స్ట్రాంగ్ వార్నింగ్..
26 మంది సాధారణ పౌరుల్ని బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ ‘‘సింధు జలాల ఒప్పందాన్ని’’ రద్దు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన పాకిస్తాన్ మంత్రి, పాకిస్తాన్ జలాలను మళ్లించడం దూకుడు చర్యగా చెప్పారు. సింధు నది పరీవాహక ప్రాంతంలో భారత్ ఆనకట్టలను నిర్మించడానికి ముందుకు వస్తే పాకిస్తాన్ స్పందన ఏమిటని ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత్ సింధు జలాలను మళ్లిస్తే అది పాకిస్తాన్‌పై దురాక్రమణ అవుతుంది. వారు నదిపై ఏ నిర్మాణం చేపట్టినా పాకిస్తాన్ ఆ నిర్మాణాలను నాశనం చేస్తుంది’’ అని ప్రకటించారు.