ఐపీఎల్ 2025లో మొదటిసారి.. నాలుగో స్థానానికి పీబీకేఎస్!
ఐపీఎల్ 2025లో మొదటిసారి ఓ మ్యాచ్ వర్షార్పణమైంది. శనివారం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా తుడిచి పెట్టుకుపోయింది. ఛేదనలో కేకేఆర్ ఇన్నింగ్స్‌లో ఒక ఓవర్ ముగిశాక వర్షం మొదలైంది. భారీ గాలులకు మైదానంను కవర్లతో కవర్ చేయడం కూడా కష్టమైంది. వర్షం ఎంతకీ తగ్గక పోవడంతో ఆట సాధ్యం కాలేదు. వరుణుడి ప్రతాపంతో మ్యాచ్ రద్దు కావడంతో.. రెండు జట్లకు చెరో పాయింట్ లభించింది. పట్టికలో ప్రస్తుతం పంజాబ్ నాలుగో స్థానంలో ఉండగా.. కేకేఆర్ ఏడో స్థానంలో నిలిచింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పీబీకేఎస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (83; 49 బంతుల్లో 6×4, 6×6), ప్రియాంశ్ ఆర్య (69; 35 బంతుల్లో 8×4, 4×6)లు రెచ్చిపోయారు. ఇద్దరు బౌండరీలు, సిక్సులు బాదుతూ తొలి వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రియాంశ్ అవుట్ అయినా ప్రభ్‌సిమ్రన్ తగ్గలేదు. సకారియా, వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఫోర్లు, సిక్సులు బాది స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. దాంతో పంజాబ్ 14 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 158 రన్స్ చేసింది.
ఇండస్ట్రీలో ఇద్దరు హీరోయిన్స్ ఎప్పటికీ స్నేహితులు కాలేరు..
సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. భాషతో సంబంధం లేకుండా దాదాపు అందరు హీరోలతో జత కట్టిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. ప్రజంట్ గుర్తింపు ఉన్న పాత్రలు ఎంచుకుంటూ వరుస సినిమాలు, సిరీస్ లు చేస్తుంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా సిమ్రాన్.. ఏదో నాలుగు సీన్స్ కోసం స్క్రీన్‌పై కనిపించడం కంటే ఆంటీ లేదా అమ్మ పాత్రల్లో నటించడమే ఉత్తమమంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్స్‌ను ఎవ్వరిని ఉద్దేశించి అన్నది అనే విషయం పక్కన పెడితే ఈ మాటలు దూమరం లేపాయి. అయితే తాజాగా సిమ్రాన్ మరోసారి ఈ విషయం పై క్లారిటీ ఇచ్చింది.
సిమ్రాన్ మాట్లాడుతూ.. ‘నా తోటి నటి చేసిన కామెంట్స్ నన్నెంతో బాధించాయి. ఆ బాధతోనే ఇటీవల జరిగిన అవార్డుల కార్యక్రమంలో నాకు అనిపించింది చెప్పాను. ఒక్కప్పుడు నా కెరీర్ ఎలా ఉందో మీకు తెలుసు. ప్రజంట్ అడపాదడపా ఆంటీ రోల్స్‌లో యాక్ట్ చేస్తున్నాను.. అలా యాక్ట్ చేయడంలో తప్పేముంది. ఆ రోల్స్ నాకు ఇష్టమే. నిజం చెప్పాలంటే ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ ఎప్పటికీ స్నేహితులు కాలేరు. నాకు ఎదురైన అనుభవంతో అది మరోసారి నిరూపితమైంది. స్నేహితులనుకున్నవాళ్లు కొన్ని సందర్భాల్లో తమ కామెంట్స్‌తో మనల్ని ఎంతో బాధిస్తారు. ఆ అవార్డుల కార్యక్రమం తర్వాత ఆ నటి నాకు మరోసారి ఫోన్ చేసింది. నేను ఏమీ ఇబ్బందిపడలేదు కానీ, ఆమెతో అంతకుముందు ఉన్న రిలేషన్ ఇప్పుడు లేదు అంతే..’ అని సిమ్రాన్ చెప్పుకొచ్చింది. కానీ ఇంతకీ ఎవరా నటి అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
పాకిస్థాన్‌లో బందీగా భారత్ జవాన్.. అప్పగించేందుకు పాక్ నిరాకరణ..
భారత సరిహద్దు భద్రతా దళానికి చెందిన జవాను పూర్ణం సాహూ ఇటీవల పొరబాటుగా సరిహద్దు దాటి పాక్ సైన్యానికి చిక్కిన సంగతి తెలిసిందే. ఆ జవానును పాక్ బంధీగా చేసుకుంది. సైనికుడు తమ భూభాగంలోకి రావడం వల్లే అదుపులోకి తీసుకున్నట్లు పాక్ ఆర్మీ వెల్లడించింది. అయితే పాకిస్థాన్ వ్యాఖ్యలను బీఎస్ఎఫ్ అధికారులు తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటన జరిగి 85 గంటలకు పైగా గడిచినా, సైనికుడిని తిరిగి ఇవ్వడంపై పాకిస్థాన్ నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాలేదు. ఇంతలో పశ్చిమ బెంగాల్‌లోని సైనికుడి కుటుంబం తీవ్ర ఆందోళన చెందుతోంది. జవాన్ తండ్రి తన కొడుకు భద్రత గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
చెన్నై ఓటములకు ప్రధాన కారణం అదే: ఎంఎస్ ధోనీ
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) వరుస పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఐదుసార్లు ఛాంపియన్ అయిన సీఎస్‌కే.. ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శన చేస్తోంది. ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడి కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. సీఎస్‌కే ప్లేఆఫ్స్ దారులు దాదాపుగా మూసుకుపోయాయి. మిగిలిన 5 మ్యాచ్‌లలో గెలిచినా.. 14 పాయింట్స్ మాత్రమే ఖాతాలో చేరుతాయి. ప్రస్తుత సమీకరణాల ప్రకారం సీఎస్‌కే ప్లేఆఫ్స్ చేరడం అసాధ్యం. సీఎస్‌కే పరాజయ పరంపర నేపథ్యంలో కెప్టెన్ ఎంఎస్ ధోనీ నిస్సహాయత వ్యక్తం చేశాడు.
వీళ్లు మారరు.. HIT – 3 కోసం అదనపు రేట్లు
ఓ వైపు ప్రేక్షకులు థియేటర్స్ కు రావడం లేదని సినిమా నిర్మాతలు మొత్తుకుంటున్నారు. అటు డిస్ట్రిబ్యూటర్స్ కూడా మంచి సినిమాలు ఏవి రావడం లేదు, ఆడియెన్స్ రావడం లేదని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. అందుకు ఓటీటీ కారణం అని కొందరు అంటే కాదు సినిమాలు మంచివి రావడంలేదు అలాగే బాగున్నా సినిమాలకు టికెట్ రేట్స్ పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని మరికొందరి వాదన. ఇలా కారణం ఏదైనా సరే థియేటర్స్ కు మునుపటిలా అయితే రావడంలేదనేది వాస్తవం.
అయితే టికెట్స్ పెంపు అనేది ప్రతి సినిమాకు తీసుకురావడం అనేది ఆడియెన్స్ థియేటర్ కు దూరం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని మెజర్ గా వినిపించే వాదన. ఇటీవల వచ్చిన మ్యాడ్ స్క్వేర్ అనే సినిమాకు కూడా అదనపు రేట్లు తెచ్చారు. ఇక ఇప్పుడు నేచురల్ స్టార్ నాని నటించినన హిట్ 3 సినిమాకు అదనపు రేట్లు కోసం ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టారు. నేడో లేదా రేపో అనుమతులు వచ్చే అవకాశం ఉంది. టికెట్ పై ఏకంగా రూ. 50 అలాగే రూ. 75 పెంచుకునేందుకు అనుమతి కోరారు మేకర్స్. హిట్ 3 సినిమాను వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ బ్యానర్ పై హీరో నాని నిర్మించారు. మేకింగ్ పేరుతో కోట్లకి కోట్లు బడ్జెట్ పెంచేయడం, రూపాయి కూడా నార్త్ ప్రమోషన్స్ కోసం భారీగా డబ్బులు పెట్టేసి వాటిని కూడా తెలుగు ప్రేక్షకుల దగ్గర నుండి రాబట్టుకోవడం ఎంత వరకు కరెక్ట్ అనేది సామాన్య ప్రేక్షకుడి నుండి వచ్చే ప్రశ్న. ఇలా కోట్లకు కోట్లు బుడ్జెట్ పెంచి అదనపు రేట్లు తెచ్చి థియేటర్ కు జనాలు రావడం లేదు అంటే ఎందుకు వస్తారు. వీళ్లు మారరని.. వీళ్లు ఇంతే అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు సగటు సినిమా ప్రేక్షకుడు.
తెలంగాణలో మరోసారి అవినీతి కలకలం
తెలంగాణలో మరోసారి అవినీతి కలకలం రేపింది. కాలేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్ చీఫ్ (ఈఎన్సీ) హరి రామ్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అక్రమాస్తుల కేసు నమోదు చేసి, అతని ఇంటితో పాటు బంధువుల ఇళ్లలో 13 చోట్ల భారీగా సోదాలు నిర్వహించారు. గజ్వెల్ లో ప్రారంభమైన ఈ దర్యాప్తు, హరి రామ్‌కు చెందిన ఆస్తులను గుర్తించడంలో కీలకమైన భాగం కావడమే కాక, ఆస్తుల విలువ కూడా ఆహ్లాదకరంగా ఉంది.
ఈ సోదాలు షేక్‌పేట్, కొండాపూర్, శ్రీనగర్, నార్సింగి, మాదాపూర్ లోని విల్లాలు, ఫ్లాట్లు, ఏపీ అమరావతిలోని కమర్షియల్ ఫ్లాట్‌లతో పాటు, మార్కూక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పఠాన్ చెరులో 20 గుంటలు, శ్రీనగర్ లో రెండు ఇండిపెండెంట్ ఇండ్లను కూడా గుర్తించాయి. ఇక, బొమ్మల రామారంలో 6 ఎకరాల మామిడి తోట, ఫామ్ హౌస్, కొత్తగూడెం, కుబ్బులాపూర్, మిర్యాలగూడలో ఓపెన్ ప్లాట్లను కూడా అధికారులు గుర్తించారు.
‘రామాయణ’ ఫస్ట్ లుక్ రిలీజ్‌కు గట్టిగా ప్లాన్ చేస్తున్నా మూవీ టీం..
బాలీవుడ్‌లో రామాయణ ప్రాజెక్టు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ రాముడిగా, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి సీతగా, హీరో యశ్ .. రావణుడి పాత్రలో కనిపించనున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ సుర్పణకగా. రవి దూబే లక్ష్మణుడు, సన్నీ డియోల్, బాబీ డియోల్ ముఖ్యపాత్రాలో కనిపించనున్నారు.దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్నారు ఈ భారీ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది, మొదటి భాగం 2026 దీపావళికి, రెండవ భాగం 2027 దీపావళికి విడుదల కానున్నాయి. అయితే ఈ మూవీ స్టార్ట్ అయ్యి అని పనులు మొదలు పెట్టినప్పటి ఇప్పటి వరకు ఎలాంటి అప్ డెట్ వదలేదు. మొన్న శ్రీరామనవమి రోజు ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను విడుదల చేయాలని అనుకుంది చిత్రబృందం. కానీ అనుకోని కారణాలతో అది జరగలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్న ఈ ‘రామాయణ’ పరిచయ వీడియోను ప్రదర్శించేందుకు ‘వేవ్స్ సమ్మిట్’ సరైన వేదిక అని నిర్ణయించుకున్నారు మూవీ టీం.