పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత.. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఎట్టకేలకు నిజాన్ని ఒప్పుకున్నాడు. బ్రిటన్‌కు చెందిన స్కై న్యూస్‌తో జరిగిన సంభాషణలో ఖవాజా ఆసిఫ్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం, ఉగ్రవాదానికి నిధులను అందించడంలో పాకిస్థాన్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందని అంగీకరించారు. తాము 30 సంవత్సరాలుగా అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమదేశాల కోసమే ఈ చెత్త పనులన్నీ చేస్తున్నామన్నారు.
READ MORE: Pahalgam Terror Attack: హఫీజ్ సయీద్ నేతృత్వంలోనే పహల్గామ్ దాడి.. నివేదిక వర్గాలు నిర్ధారణ!
భారతదేశంతో పూర్తి స్థాయి యుద్ధం గురించి మాట్లాడిన ఖవాజా ఆసిఫ్ పాకిస్థాన్‌లో లష్కరే తోయిబా అంతమైందని అన్నారు. లష్కరే తోయిబాకు గతంలో పాకిస్థాన్‌తో కొన్ని సంబంధాలు ఉన్నాయని ఖవాజా ఆసిఫ్ అంగీకరించారు. అయితే, ఇప్పుడు ఈ ఉగ్రవాద సంస్థ అంతమైందన్నారు. “లష్కరే నుంచి ఉద్భవిస్తున్న ఉగ్రవాద సంస్థ పహల్గామ్ దాడికి బాధ్యత వహించింది కదా?” అని యాంకర్ ఖ్వాజా ఆసిఫ్‌ను ఆడిగారు. మాతృ సంస్థ(లష్కరే తోయిబా) లేనప్పుడు ఆఫ్‌షూట్ సంస్థ ఎక్కడి నుంచి వస్తుంది అని సమాధానమిచ్చారు.
READ MORE: Bharat Summit : హైదరాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైన భారత్ సమ్మిట్ 2025
ఈ ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం, శిక్షణ ఇవ్వడం, నిధులు సమకూర్చడంలో పాకిస్థాన్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందని మీరు నమ్ముతున్నారా? అని యాంకర్ క్వశ్చన్ వేశారు. ఈ ప్రశ్నకు ఆసిఫ్ సమాధానమిస్తూ ..పాకిస్థాన్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తోందని అంగీకరించారు. ఇది తమ తప్పు అని.. దీనివల్ల తమకు నష్టం వాటిల్లిందని ఖ్వాజా ఆసిఫ్ అన్నారు. పాకిస్థాన్ సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్‌లో చేరకపోతే.. ఎవరూ పాకిస్థాన్ వైపు వేలు చూపలేకపోయేవారు అని అన్నారు.