బెజవాడలో 10 మంది ఉగ్రవాదులు?.. ఉగ్ర కదలికలపై పోలీసుల ఆరా..
బెజవాడలో ఉగ్ర కదలికలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సిమి(SIMI) సానుభూతి పరుల గురించి 2 నెలల క్రితం కేంద్ర నిఘా వర్గాల నుంచి బెజవాడ పోలీసులకు సమాచారం అందింది. కేంద్ర నిఘా సంస్థ నలుగురు అనుమానితులు గురించి సమాచారం ఇచ్చింది. మరో ఆరుగురు అనుమానితులను స్థానిక పోలీసులు గుర్తించారు. మొత్తం 10 మంది కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. 10 మంది గొల్లపూడి, అశోక్ నగర్, లబ్బీపేట ప్రాంతాల్లో వేర్వేరు పనులు చేస్తున్నట్టు గుర్తించారు. ఇప్పటివరకు ఏ కార్యక్రమాలు చేయటం లేదని నిఘా కొనసాగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో కూడా మావోయిస్తులకి షెల్టర్ జోన్‌గా బెజవాడ నిలిచింది.
ప్లాపుల నిర్మాత బ్యానర్ లో ప్లాప్ స్టార్ సినిమా షురూ
మ్యాచో స్టార్ గోపీచంద్.. యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ ఇలా పాత్ర ఏదైనా సరే పర్ఫెక్ట్ గా పండించగల నటుడు. కానీ ఏమి ఉపయోగం. ఒక సినిమా హిట్ అయితే వరుసగా అరడజనుప్లాపులు ఇస్తున్నాడు గోపీచంద్. ఆ యంగ్ హీరో నటించిన చివరి సినిమా ‘విశ్వం’. శ్రీనువైట్ల దర్శకత్వంలో ఈ సినిమా ఈ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గ్గా నిలిచింది. దాంతో ఇక సినిమాలకు కాస్తా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్ లో కథలు విని తన నెక్ట్స్ సినిమాలను అనౌన్స్ చేసాడు. ఇప్పటికే ఘాజీ సినిమా దర్శకుడు సంకల్ప్ రెడ్డి డైరెక్షన్‌లో ఓ సినిమాను ప్రకటించాడు గోపీచంద్.
ఉగ్రవాది ఇంటిని పేల్చేసిన భద్రతా దళాలు..
అనంత్‌నాగ్ జిల్లా బిజ్‌బెహారాలోని గోరి ప్రాంతంలో ఉన్న పహల్గామ్ దాడిలో పాల్గొన్న స్థానిక ఉగ్రవాది ఆదిల్ హుస్సేన్ థోకర్ ఇంటిపై భద్రతా దళాలు బాంబు దాడి చేశాయి. ఆదిల్ థోకర్ అలియాస్ ఆదిల్ గుర్రీగా గుర్తించబడిన ఉగ్రవాది.. ఏప్రిల్ 22న పహల్గామ్‌లోని బైసరన్ లోయలో జరిగిన దాడిని ప్లాన్ చేయడం, అమలు చేయడంలో పాకిస్థాన్ ఉగ్రవాదులకు సహాయం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడిలో పాల్గొన్న మరో స్థానిక ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ట్రాల్‌లో ఉన్న ఇంటిని జమ్మూకశ్మీర్ పరిపాలన బుల్డోజర్ తో కూల్చివేసింది.
బైసరన్ లోయపై కేంద్రం సంచలన ప్రకటన.. ఆ విషయమే తెలియదని వెల్లడి
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత గురువారం కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆధ్వర్యంలో ఈ ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా పహల్గామ్‌లో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని అఖిలపక్ష నేతలు విషయాన్ని లేవనెత్తారు. దీనిపై కేంద్ర పెద్దలు జోక్యం పుచ్చుకుని.. అసలు బైసరన్ లోయ తెరిచిన విషయమే తమకు తెలియదని పేర్కొన్నారు. స్థానిక అధికారులు తమకు సమాచారమే ఇవ్వలేదని కేంద్ర పెద్దలు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఇంటెలిజెన్స్ బ్యూరోలోని ప్రత్యేక డైరెక్టర్ అఖిలపక్ష నేతలకు వివరణ ఇచ్చారు. భద్రతా దళాలకు సమాచారం ఇవ్వకుండానే ఏప్రిల్ 20న బైసరన్ లోయ తెరిచారని పేర్కొన్నారు. సాధారణంగా ఈ లోయ జూన్ నెలలో మాత్రమే అమర్‌నాథ్ యాత్రికుల కోసం తెరిచి ఉంటుందని.. అలాంటిది ఈ నెలలో ఎందుకు తెరిచారో తమకు తెలియదని ఆయన వివరించారు. స్థానిక అధికారులు ఎలాంటి సమాచారాన్ని ఇవ్వకుండానే తెరిచారని ప్రత్యేక డైరెక్టర్ నేతలకు వివరించారు. ఏప్రిల్ 22న ఉగ్ర దాడి జరిగిన సమయంలో అక్కడ భద్రతా సిబ్బంది లేరని ఆయన ఒప్పుకున్నారు. ఆ లోయ తెరిచిన విషయం తెలియకపోవడంతోనే ఇదంతా జరిగినట్లుగా చెప్పుకొచ్చారు.
నేడు శ్రీనగర్, ఉదంపూర్‌లో ఆర్మీ చీఫ్ పర్యటన
ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం శ్రీనగర్, ఉధంపూర్‌లో పర్యటించనున్నారు. కాశ్మీర్ లోయలో మోహరించిన సీనియర్ ఆర్మీ కమాండర్లతో పాటు ఇతర భద్రతా సంస్థల అధికారులను కలవనున్నారు. లోయలో కొనసాగుతున్న భద్రతా పరిస్థితిని, నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పరిస్థితులను సమీక్షించనున్నారు. ఈ మేరకు రక్షణ అధికారులు వెల్లడించారు. ఇక లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ కాశ్మీర్‌లో పర్యటించనున్నారు. పహల్గామ్ ఉగ్ర దాడిలో గాయపడిన బాధితులను పరామర్శించనున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో భద్రతా అధికారులు అప్రమత్తం అయ్యారు. మంగళవారం పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. పదుల కొద్దీ గాయాలు పాలయ్యారు. ప్రస్తుతం బాధితులు కోలుకుంటున్నారు.
బాబర్, గేల్‌ల రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ!
యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డును టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. టీ20ల్లో 50+ స్కోర్లను అత్యధిక సార్లు చేసిన బ్యాటర్‌గా విరాట్ రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం రాత్రి చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ హాఫ్ సెంచరీ (70; 42 బంతుల్లో 8×4, 2×6) చేయడంతో ఈ రికార్డు అతడి ఖాతాలో చేరింది. ఇప్పటివరకు కోహ్లీ 50+ స్కోర్లను 111 సార్లు నమోదు చేశాడు. టీ20ల్లో 50+ స్కోర్లను క్రిస్ గేల్ 110 సార్లు బాదాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (117) అగ్ర స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ 2025లో విరాట్ కోహ్లీ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. ఈ సీజన్‌లోనే వార్నర్‌ను సైతం అధిగమించే అవకాశాలు లేకపోలేదు. రాజస్థాన్ రాయల్స్‌పై చేసిన హాఫ్ సెంచరీతో మరో రికార్డును కింగ్ తన ఖాతాలో వేసుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు కోహ్లీ 62 హాఫ్ సెంచరీలు బాదాడు. ఈ జాబితాలో బాబర్ అజామ్ (61)ను అధిగమించాడు.
కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు సహకరించింది..
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన గౌతమ్ రావు ఓటమి అనంతరం తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తన కార్పొరేటర్లను ఓటు వేయకుండా అడ్డుకుందని ఆరోపిస్తూ, ఎలక్షన్ కమిషన్ ముందు ఈ విషయాన్ని ఉంచనున్నట్లు తెలిపారు. “ఓటు వేయొద్దని మీ పార్టీ నేతలే చెబితే, మీరు రేపు ప్రజలను ఓటు వేయమని ఎలా అడుగుతారు?” అని ప్రశ్నించారు గౌతమ్ రావు. అలాగే, ఎంఐఎం పార్టీ చేతుల్లో కాంగ్రెస్ పనిచేస్తోందని, ఈ ఎన్నికల ఫలితంతో ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకటేనని స్పష్టమైందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు ఈ రహస్య ఐక్యతను గుర్తించాలి అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ, తనకు ఓటేసిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీసియో సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు గౌతమ్ రావు. అంతేగాక, ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లను, వారి అధిష్ఠానమే అడ్డుకుందని తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ గుర్తింపును రద్దు చేయాలంటూ ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.
ఏం సాధించారు.. 78 వేల సంవత్సరాలైనా మిల్లీమీటర్ భూమిని లాక్కోలేరు: గవాస్కర్
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఉగ్రదాడిపై ప్రధాని మోడీ స్పందిస్తూ.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఘటనపై ప్రపంచం మొత్తం స్పందిస్తోంది. ఉగ్రదాడిపై పలువురు టీమిండియా మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. తాజాగా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు గత 78 ఏళ్లలో సాధించింది ఏమీ లేదని, 78 వేల సంవత్సరాలైనా మిల్లీమీటర్ భూమిని లాక్కోలేరన్నారు.
హైదరాబాద్ బాలానగర్ ఎస్సై లక్ష్మీనారాయణపై సస్పెన్షన్ వేటు
హైదరాబాద్ బాలానగర్ ఎస్సై లక్ష్మీనారాయణపై సస్పెన్షన్ వేటు. అవినీతి ఆరోపణలతో ఎస్‌ఐను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సీపీ ఉత్తర్వులు. ఎస్‌ఐ లక్ష్మీనారాయణపై పలు అవినీతి అరోపణలు. ఓ మహిళ కేసు విషయంలో ముగ్గురిని అకారణంగా కొట్టినట్లు ఆరోపణలు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లో బాధితుల ఫిర్యాదు. హైదరాబాద్‌లోని బాలానగర్ పోలీస్ స్టేషన్ ఎస్సై లక్ష్మీనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. అవినీతి ఆరోపణలు రావడంతో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ (సీపీ) ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సై లక్ష్మీనారాయణపై గత కొంతకాలంగా పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి.
జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఖతం..
జమ్మూ కాశ్మీర్‌లోని బండిపోరా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబాకు చెందిన ఒక టాప్ కమాండర్ హతమయ్యాడు. లష్కర్ ఉగ్రవాది అల్తాఫ్ లాలిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. శుక్రవారం ఉదయం నుంచి బండిపోరాలో ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. బండిపోరా జిల్లాలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం అందడంతో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. దాగి ఉన్న ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరపడంతో సెర్చ్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది గాయపడ్డాడు. ఇద్దరు భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన నాల్గవ ఎన్‌కౌంటర్ ఇది.