కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం "ఆపరేషన్ సిందూర్" నిర్వహించింది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని, భారత వైమానిక దళం, భారత సైన్యం, నావికాదళం సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ దాడిలో క్షిపణులు ప్రయోగించారు. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు.
Pakistan: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్, బుధవారం తెల్లవారుజాము ‘‘ఆపరేషన్ సింధూర్’’ పేరుతో పీఓకే, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను నామరూపాలు లేకుండా చేసింది. ఈ దాడుల్లో సుమారుగా 80 మంది వరకు ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. భారత్ జరిపిన దాడిలో ఒక్కసారిగా పాకిస్తాన్ షాక్‌కి గురైంది. ఇదిలా ఉంటే, ఈ దాడులపై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ, ఇతర ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాలు నిర్వహించారు.
Scalp, Hammer: పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ‘‘ఆపరేషన్ సింధూర్’’తో ప్రతీకారం తీర్చుకుంది. పీఓకేతో పాటు పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతాల్లోకి దూరి ఉగ్రస్థావరాలను నాశనం చేసింది. ఈ దాడుల్లో జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలకు చెందిన 80 మంది వరకు ఉగ్రవాదులను హతం చేసింది. ముఖ్యంగా, బలహల్పూర్‌లోని జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది హతమయ్యారు. ఇదిలా ఉంటే, ఈ దాడుల్లో భారత్ వాడిని ఆయుధాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. స్కాల్ప్…
Operation Sindoor: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేపట్టిన ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’కి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్ వ్యాప్తంగా 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ త్రివిధ దళాల నేతృత్వంలో ‘‘ఆపరేషన్ సింధూర్’’ పేరుతో దాడులు జరిగాయి.
ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించిన భారత ఆర్మీ.. పాక్ పై మెరుపుదాడులు.. భారత్- పాకిస్తాన్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ను ఇండియన్ ఆర్మీ ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో దాయాది దేశంలోని 9 ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులకు దిగింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. మొత్తం 9 పాక్ ఉగ్ర స్థావరాలను ఇప్పటి వరకు భారత ఆర్మీ ధ్వంసం…
పహల్గాం ఉగ్రదాడులకు ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ భారత్ నినదించిన వేళ భారత్ పాక్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదుల ఏరివేతకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో పలు విమానాల రాకపోకలు రద్దయ్యాయి. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సాయుధ దళాలు దాడుల నేపథ్యంలో మే 7న మధ్యాహ్నం 12 గంటల వరకు జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, భుజ్, జామ్‌నగర్, చండీగఢ్, రాజ్కోట్లకు వెళ్లే అన్ని…
Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ వణికిపోతోంది. భారత్ ప్రతీకారంగా ఎప్పుడు తమపై విరుచుకుపడుతుందో తెలియక దాయాది ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ ఆందోళన నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వంలోని కీలక నాయకులు ఏం మాట్లాడుతున్నారో వారికి కూడా అర్థం కావడం లేదు. ప్రభుత్వంలో మంత్రులు భారత్‌ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని, భారత్ దాడి చేస్తే అణ్వాయుధాలతో దాడి చేస్తామని చెబుతున్నారు.
India-Pakistan tensions: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా, పాకిస్తాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది. భారత్‌తో యుద్ధానికి మేము సిద్ధమని, మా వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని ప్రభుత్వంలోని మంత్రులు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు.
Cabinet Meeting: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర క్యాబినెట్ కీలక సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షత ఈ సమావేశం జరుగబోతోంది. పాకిస్తాన్‌పై సైనిక చర్య తీసుకుంటారనే ఊహాగానాల నడుమ ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.