హర్యానా, పంజాబ్‌ల తరహాలోనే తెలంగాణలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రమే కొనుగోలు చేయాలనే డిమాండ్‌ను ఇటీవల తెరపైకి తెచ్చింది చేయాలనే డిమాండ్‌ను తెరపైకి కేసీఆర్ ప్రభుత్వం. దీనిపై చర్చించేందుకు తెలంగాణ మంత్రులు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర ఆహార మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ కూడా అయ్యారు. కానీ… భేటీకి ముందే… కీలక ప్రకటన చేశారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్. తెలంగాణలో పండిన మొత్తం ధాన్యాని కొనలేమన్నారు. డిమాండ్-సరఫరా ఆధారంగానే అదనంగా ఉన్న ఉత్పత్తుల కొనుగోళ్లు ఉంటాయని…
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రులు మండిపడ్డారు. మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం క్షమాపణలు చెప్పే పరిస్థితి వస్తుంది. ఈ పరాభవాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోరు. ఏ అంశంలోనూ నవ్యత్వం లేదు. కేంద్ర ప్రభుత్వానికి వ్యాపారధోరణితో వ్యవహరించడం తప్పితే, సంక్షేమం గురించి ఆలోచించే మనసే లేదు. ముఖ్యమంత్రి ఆలోచించి తదుపరి కార్యాచరణ ఖరారు చేస్తాం. అయితే, ఏది ఏమైనా, రైతుల ప్రయోజనాలను మా ప్రభుత్వం…
తెలంగాణలో ధాన్యం సేకరణకు సంబంధించి కేంద్రంపై టీఆర్ఎస్ పోరాటానికి దిగిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో తెలంగాణ మంత్రుల సమావేశం ముగిసింది. అరగంటపాటు సాగింది ఈ సమావేశం. పంజాబ్ నుంచి ఏ తరహాలో అయితే బియ్యాన్ని కేంద్రం సేకరిస్తుందో, తెలంగాణ నుంచి కూడా అదే తరహాలో బియ్యాన్ని సేకరిస్తుంది. ఏ రాష్ట్రం పట్ల కేంద్రం ఎలాంటి వివక్షతతో వ్యవహరించదన్నారు కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్. తెలంగాణ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం.…
బీజేపీ రాష్ట్ర అధినేత బండి సంజయ్ అంటే వారికి ఎంతో అభిమానం. దానిని వెరైటీగా చూపించాడు. సిద్దిపేట జిల్లా నంగునూర్ గ్రామానికి చెందిన బెదురు కూమారా స్వామి అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి వీరాభిమాని. ఆయనపై వున్న అభిమానంతో తన వ్యవసాయ క్షేత్రంలో వరి నారుతో బండి సంజయ్ అని వరి నాటారు. వరి నారు బాగా రావడంతో పేరు బాగా కనిపిస్తోంది. ఈ నారుని చూడడానికి…
తెలంగాణలో వరి వేయవద్దని ప్రత్నామ్నాయ పంటలు వేయాలని స్వయంగా కేసీఆర్, మంత్రులు పదే పదే చెవిలో ఇల్లు కట్టుకుని చెబుతూనే వున్నారు. అయితే రైతులు మాత్రం చాలా చోట్ల వరి వైపే మొగ్గు చూపుతున్నారు. వరిపంట వేయవద్దని ప్రభుత్వం ఆదేశించినా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రైతులు వరినాట్లు వేసేందుకు సిద్ధం కావడం చర్చనీయాంశం అవుతోంది. ప్రత్యామ్నాయ పంటలపై ప్రభుత్వం ప్రకటన చేసింది తప్ప ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహనా కల్పించడం లేదని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు.…
రాష్ట్రప్రభుత్వం అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించకపోవడం దురదృష్టకరం అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అధికారుల వ్యవహారశైలి కూడా కేసీఆర్ కు అనుగుణంగా ఉంది. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అధికారులపై తక్షణమే చర్యలు తీసకోవాలి. గత మూడు నెలలుగా తెలంగాణ రైతాంగం వరిధాన్యం అమ్ముకోలేక అవస్థలుపడుతున్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ శ్రేణులు రైతాంగం సమస్యలపై పోరాటం చేస్తున్నా రాష్ట్రప్రభుత్వ వైఖరి భిన్నంగా ఉందని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో మొక్కుబడి ఆందోళన చేస్తున్నారు. ఎంపీలు సేదదీరే…
ధాన్యం కొనుగోళ్ల అంశానికి సంబంధించి.. తదుపరి కార్యాచరణ విషయమై.. ముఖ్యమంత్రి కేసీఆర్.. ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా ఇవాళ మరోసారి దాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. ఇవాళ వ్యవసాయ శాఖ అధికారులు, టీఆర్ఎస్ ఎంపీలతో ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించనున్నారు తెలంగాణ సీఎం. ధాన్యం కొనుగోళ్ల విషయం పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్…
వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి ఆందోళన చేస్తూ వస్తున్న తెలంగాణ ఎంపీలు.. ఇవాళ లోక్‌సభ, రాజ్యసభలో ఈ విషయాన్ని లేవనెత్తారు.. లోక్‌సభలో ధాన్యం సేకరణపై మాట్లాడిన ఎంపీ నామా నాగేశ్వరరావు.. తెలంగాణ రైతుల ధాన్యం సేకరణ గురించి గత ఐదు రోజుల నుంచి ఆందోళన చేస్తున్నామని తెలిపారు.. తెలంగాణలో రైతులకు ఉచితంగా 24 గంటలు కరెంటు ఇస్తున్నాం.. రైతు బంధు ఎకరానికి 10 వేలు ఇస్తున్నాం.. కాళేశ్వరం ప్రాజెక్టు…
వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర వర్సెస్ తెలంగాణ ప్రభుత్వంగా మారిపోయింది పరిస్థితి.. యాసంగిలో వరి కొనే పరిస్థితి లేదని కేంద్రం తేల్చేయడంతో.. ప్రత్యామ్నాయ పంటలపై ఫోకస్ పెట్టాలని రైతులకు సూచిస్తోంది తెలంగాణ సర్కార్.. మరోవైపు.. ప్రతీ గింజా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు.. కేంద్రం కొనదు కానీ, రాష్ట్ర నేతలు ఇలా మాట్లాడడం ఏంటి? అంటూ టీఆర్ఎస్ మండిపడుతోంది.. ఈ తరుణంలో.. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే చేసిన…
యాసంగిలో వరి పంట వేయాలా? వద్దా? అనే గందరగోళ పరిస్థితి నెలకొంది.. ఎందుకంటే.. ఇప్పటికే మార్కెట్లకు చేరిన పంట.. కల్లాలు, రోడ్లపై ఉన్న పంట కొనుగోలు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారే నడిచింది.. ఇక, తాజాగా యాసంగిలో వరి పంట వేయొద్దంటూ కేంద్రం కూడా స్పష్టంగా చెప్పేసింది.. దీంతో.. యాసంగిలో వరి పంట వేయొద్దు అంటూ క్లారిటీ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.. పౌర సరఫరాల శాఖ అధికారులతో…