సీఎం కేసీఆర్ పై మరోసారి వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. ధాన్యం కొనుగోలు అంశంలో కేసీఆర్ సర్కార్ పై ఆమె మండిపడ్డారు. ఢిల్లీ రాజకీయాలు చేసే దొరగారికి ఇక్కడి రైతుల చావులు, నేతన్నల ఆత్మహత్యలు కనిపించడం లేదంటూ నిప్పులు చెరిగారు. పెట్టిన పెట్టుబడి రాక, పండిన పంట కళ్ళ ముందు కొట్టుకుపోతుంటే, అప్పులు తీరక గుండెలు ఆగిపోతుంటే కేసీఆర్ గారికి మాత్రం కనిపించడం లేదని ఆగ్రహించారు వైఎస్ షర్మిల. దొరా.. పంటలు కొనండి అని గుండెలు ఆగేలా…
కేంద్ర బీజేపీపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనకపోతే… బీజేపీ పార్టీ ఆఫీసుపై పారబోస్తామని హెచ్చరించారు కేసీఆర్. తెలంగాణలో పండించిన వరి కొంటారా కొనరా? ఒక్కటే మాట సాఫ్ సీదా చెప్పాలని డిమాండ్ చేశారు కేసీఆర్. రైతులు ఏడాది కాలంగా ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు.. కేంద్రం తన విధానాలు మార్చుకోకుండా తప్పుడు మాటలు మాట్లాడుతోందని ఆగ్రహించారు. ధాన్యం కొనుగోలుకు విషయాన్ని అర్థం చేసుకునే ఇంకిత జ్ఞానం కేంద్రానికి…
నిన్న టీఆర్‌ఎస్ భవన్ లో చెప్పిన విధంగానే… దేశ ప్రధాని నరేంద్ర మోడీ కి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ధాన్యం కొనుగోళ్ల పై ఎఫ్‌సీఐకి ఆదేశాలు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీని లేఖ లో కోరారు తెలంగాణ సీఎం కేసీఆర్. 2020- 21 ఎండాకాలం సీజన్ లో సేకరించకుండా మిగిలి వుంచిన 5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని తక్షణమే సేకరించాలని కూడా ఈ లేఖ లో డిమాండ్ చేశారు కేసీఆర్. 40 లక్షల…
తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు వ్యవహారం రాజకీయపార్టీల మధ్య యుద్ధంగా మారుతోంది. పరస్పరం విమర్శలతో రాజకీయం వేడెక్కుతోంది. వరి ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకే సిద్ధమైంది బీజేపీ. ఇవాళ, రేపు నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 10.30 కి నల్గొండ కి చేరుకోనున్నారు బండి సంజయ్. చర్లపల్లి బైపాస్ వద్ద ఘన స్వాగతం బీజేపీ శ్రేణులు స్వాగతం పలకనున్నాయి. అనంతరం ఆర్జాలబావి…
ప్రభుత్వం.. పార్టీల మధ్య పోరాటం కాదు.. ఇది ప్రభుత్వాల మధ్య యుద్ధం.. రైతు పండించిన పంట కల్లాలు, మార్కెట్ యార్డ్‌లు, చివరకు రోడ్లపై కూడా ఎక్కడపడితే అక్కడ దర్శనమిస్తుంది.. కానీ, గిట్టుబాటు ధర చెల్లించి రైతు నుంచి పంటను కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వాలు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి… పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి.. మొత్తం వడ్ల చుట్టే తిరుగుతోంది రాజకీయం… వడ్ల పండించాలని ఒకరు, పండించవద్దని మరొకరు.. ఇలా రైతులను గందరగోళంలోకి నెట్టేస్తున్నారు.. వడ్లను రాష్ట్ర ప్రభుత్వం కొనాలని కేంద్రంలో…
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో తేల్చుకోవడానికి సిద్ధం అవుతున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.. అందులోభాగంగా కేంద్రంపై యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. ప్రగతి భవన్‌లో ఇవాళ మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో తేల్చుకుంటామన్నారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఆయన.. తెలంగాణలో 3 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెబుతున్నారు.. ఇది నీ చేతకాని తనం కాదా? అంటూ ఫైర్ అయ్యారు. ఇక, కేంద్రం వరి…
రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు దిగులు చెందాల్సిన అవసరం లేదని ధైర్యాన్ని చెప్పారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటిసరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు… ఇవాళ జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన.. కోవిడ్ వ్యాప్తి నివారణలో భాగంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో మాస్కుల పంపిణీ చేశారు. కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు…