బీజేపీ రాష్ట్ర అధినేత బండి సంజయ్ అంటే వారికి ఎంతో అభిమానం. దానిని వెరైటీగా చూపించాడు. సిద్దిపేట జిల్లా నంగునూర్ గ్రామానికి చెందిన బెదురు కూమారా స్వామి అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి వీరాభిమాని. ఆయనపై వున్న అభిమానంతో తన వ్యవసాయ క్షేత్రంలో వరి నారుతో బండి సంజయ్ అని వరి నాటారు. వరి నారు బాగా రావడంతో పేరు బాగా కనిపిస్తోంది. ఈ నారుని చూడడానికి వచ్చిన వారు రైతుని అభినందిస్తున్నారు.