Telangana Vs Centre: ధాన్యం సేకరణపై కొలిక్కిరాని పంచాయితీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానా, పంజాబ్‌ల తరహాలోనే తెలంగాణలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రమే కొనుగోలు చేయాలనే డిమాండ్‌ను ఇటీవల తెరపైకి తెచ్చింది చేయాలనే డిమాండ్‌ను తెరపైకి కేసీఆర్ ప్రభుత్వం. దీనిపై చర్చించేందుకు తెలంగాణ మంత్రులు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర ఆహార మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ కూడా అయ్యారు. కానీ… భేటీకి ముందే… కీలక ప్రకటన చేశారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్. తెలంగాణలో పండిన మొత్తం ధాన్యాని కొనలేమన్నారు. డిమాండ్-సరఫరా ఆధారంగానే అదనంగా ఉన్న ఉత్పత్తుల కొనుగోళ్లు ఉంటాయని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి. దేశంలోని ఆహార పదార్థాల అవసరాలతో పాటు ఇతర అంశాలను ఆధారంగానే కొనుగోళ్లు ఉంటాయంటోంది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు… ఇదే అంశంపై పార్లమెంట్‌లో ఆందోళన చేశారు టీఆర్ఎస్ ఎంపీలు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో యాసంగి పంటను మొత్తం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు నేతలు.
Read Also: IPL: రేపే ఐపీఎల్ సీజన్ స్టార్ట్.. ఉగ్రముప్పుపై స్పందించిన పోలీసులు…
Also Read
- Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
- Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
ఈ పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు తెలంగాణ సీఎం కేసీఆర్. తెలంగాణలో పండిన వరిని కొనుగోలు చేయాలని ప్రధానిని కోరారాయన. లేదంటే వరికి కనీస మద్ధతు ధరకు అర్ధం ఉండదన్నారు కేసీఆర్.. తెలంగాణలో పండిన వరిని కేంద్రం కొనకపోతే వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కేసీఆర్. ఆహార భద్రత లక్ష్యానికి కూడా తూట్లు పొడిచినట్లే అన్నారాయన. ప్రత్యామ్నాయ పంటల కోసం రైతులను ప్రోత్సహించామని.. పత్తి, పామాయిల్, రెడ్‌గ్రామ్ వేయాలని కోరామని లేఖలో వివరించారు. రబీ సీజన్‌లో 52 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందన్నారు సీఎం. అయితే, ఎలాంటి షరతులు లేకుండా తెలంగాణ నుంచి వరిని కొనుగోలు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు కేసీఆర్. ధాన్యం కొనుగోలుపై ఉగాది తర్వాత ఢిల్లీలో రైతు ధర్నా చేస్తామని ఇప్పటికే స్పష్టం చేశారు కేసీఆర్. పరిస్థితి చూస్తుంటే… ఈ వివాదం మరింత ముదిరేలా ఉంది. కేంద్రం తీరుపై తెలంగాణ మంత్రులు, టీఆర్‌ఎస్ నేతలు మండిపడుతున్నారు. పంజాబ్ తరహాలోనే తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు చేయమని కోరుతున్నామని… దేశ మంతా ఒకే విధానం ఎందుకు అమలు చేయడం లేదంటున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఎంత వరకైనా పోరాడుతాం అంటున్నారు టీఆర్ఎస్ నాయకులు.
తాజావార్తలు
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!