ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపునకు గడువు ఈరోజుతో ముగియనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు జీహెచ్ఎంసీ రూ.1,910 కోట్లు వసూలు చేసింది. 2023-24 సంవత్సరానికి మొత్తం రూ.1,917 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది రూ.2,000 కోట్ల వసూలు లక్ష్యంగా జీహెచ్ఎంసీ పని చేస్తోంది.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (OTS) కింద ఖజానాకు బాగానే డబ్బులు వచ్చి చేరుతున్నారు. ఇప్పటివరకు ఈ పథకం కింద అన్ని జిల్లాల్లో కలిపి రూ.339 కోట్లు వసూలు అయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది. 9.86 లక్షల మంది లబ్ధిదారులు రూ.10,000 చొప్పున చెల్లించి తమ ఇళ్లు రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారని ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం అత్యధికంగా వినియోగించుకున్న లబ్ధిదారుల జాబితాలో టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లా ఉండటం…
ఓటీఎస్ పథకంపై ఈరోజు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ హాజరయ్యారు. ఈ సందర్భంగా సంపూర్ణ గృహహక్కు పథకం లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి రుణ సదుపాయం అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం సీఎం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి మరో లేఖ రాశారు కాపు ఉధ్యమ నేత ముద్రగడ పద్మనాభం.. ఇప్పటికే పలు అంశాలు, సమస్యల పరిష్కారం కోసం సీఎంకు లేఖలు రాస్తూ వస్తున్న ఆయన.. ఈ సారి ఓటీఎస్ విధానాన్ని తన లేఖలో పేర్కొన్నారు.. ఓటీఎస్ పేరుతో పేద ప్రజలపై ఒత్తిడి తేవద్దని, గత ప్రభుత్వ హాయంలో చేసిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు వెంటనే చెల్లించాలని తన లేఖలో సీఎంను కోరారు ముద్రగడ.. ఇక, గత ప్రభుత్వం…
టీడీపీ ప్రతిపక్షంగా వైఫల్యం చెందిందని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పై పలు విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రజల విశ్వాసానని కోల్పోయారన్నారు. ఓటీఎస్ పై టీడీపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఆయన తెలిపారు. అధికారంలోకి రాగానే పట్టాలిస్తామంటున్న టీడీపీ నేతలు అధికారంలో ఉండగా కుంభకర్ణుడిలా నిద్రపోయారంటూ ఎద్దేవా చేశారు. Read Also: పచ్చమందకు పైత్యం బాగా ముదిరింది: విజయసాయిరెడ్డి ప్రతిపక్ష నేతలు సంస్కారం లేని మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు.…
ఏపీలో ఓటీఎస్‌ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే.. టీడీపీ మాత్రం అది పేద ప్రజల రక్తం పీల్చే పథకం అంటోంది. ఓటీఎస్ పై టీడీపీ నేతలు, కార్యకర్తల పోరాటానికి అభినందనలు తెలిపారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. కొన్నిచోట్ల ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నిరసన కార్యక్రమానికి అధికార పార్టీ నేతలు, పోలీసుల అడ్డుంకులు చేధించుకుని…
దేశంలోనే అత్యంత మౌలిక సదుపాయాలను అందిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ముందు ఉందన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. కోవిడ్ సమయంలో సైతం ప్రతీ పేద వాడిని ఆదుకున్నాం అన్నారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యాలకు గురైన విద్యా, వైద్యంలో సమూల మార్పులు చేసాం. ప్రతీ పార్లమెంట్ కి ఓ మెడికల్ కాలేజి ఏర్పాటు చేస్తున్నాం. చంద్రబాబుకు ప్రజల బాగోగులు అవసరంలేదు.. కేవలం పదవీ కాంక్ష మాత్రమే ఉందని మండిపడ్డారు. రెండుసార్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి. ఎందుకు ఇంటి లోన్లు ఉచితంగా ఇవ్వలేదన్నారు.…
ఓటీఎస్ అమలు చట్ట విరుద్దమన్నారు టీడీపీ నేత, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. చట్ట ప్రకారం ఇప్పటికే హక్కులు సంక్రమించిన ఇళ్లకూ ఓటీఎస్ అమలు చేసి దోచుకుంటున్నారని యనమల మండిపడ్డారు. అప్పులు పుట్టకే ప్రభుత్వం ఓటీఎస్ పేరుతో నాటకం ఆడుతోంది. లిమిటేషన్ యాక్ట్ ప్రకారం పేదల ఇళ్లకు 12 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు వస్తాయి. వాస్తవాలను మరుగునపెట్టి సెటిల్ మెంట్ చేస్తామనడం పేదప్రజలను మోసగించడమే.ఓటిఎస్ పేరుతో పేదల నుంచి రూ.5 వేల కోట్లు దోచుకునేందుకు మాస్టర్…
రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసమే జగన్ పనిచేస్తున్నారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. రాష్ట్రంలో అనేక సమష్యలు ఉన్నాయి.రాష్ర్ట సమష్యల పరిష్కారం కోసం కేంద్రానికి సహకరిస్తూ ముందుకు వెళుతున్నాం అన్నారు ధర్మాన. ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తూనే ఉంటాం. ప్రజా సంక్షేమమే సిఎం జగన్ లక్ష్యం అన్నారు. సంపూర్ణగృహ హక్కు గతంలో లేదు. ఎన్నో ఆలోచించి ఈ పథకం తెచ్చాం. ప్రతి ఒక్కరికీ నామినల్ వ్యయంతో నివాసానికి రిజిస్ర్టేషన్లు చేస్తున్నాం అన్నారు డిప్యూటీ సీఎం. ఓటిఎస్…