దేశంలోనే అత్యంత మౌలిక సదుపాయాలను అందిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ముందు ఉందన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. కోవిడ్ సమయంలో సైతం ప్రతీ పేద వాడిని ఆదుకున్నాం అన్నారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యాలకు గురైన విద్యా, వైద్యంలో సమూల మార్పులు చేసాం. ప్రతీ పార్లమెంట్ కి ఓ మెడికల్ కాలేజి ఏర్పాటు చేస్తున్నాం. చంద్రబాబుకు ప్రజల బాగోగులు అవసరంలేదు.. కేవలం పదవీ కాంక్ష మాత్రమే ఉందని మండిపడ్డారు.
రెండుసార్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి. ఎందుకు ఇంటి లోన్లు ఉచితంగా ఇవ్వలేదన్నారు. రూ14,600 కోట్లు హౌసింగ్ సంస్థకి లబ్ది దారులు బాకీ ఉన్నారన్నారు. ఓటీఎస్ తో లబ్దిదారులు సంపూర్ణ రుణ విముక్తులవుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ప్యాకేజ్ కోసం చంద్రబాబు గతంలో లాలూచీ పడ్డారని అప్పలరాజు విమర్శించారు.
అందుకే హోదా అడిగితే కేంద్రం ప్యాకేజీ ఇచ్చామంటున్నారు. కనీసం ప్యాకేజీని కూడా 15 సంవత్సరాలకు అడగలేదు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తూనే వుంటామన్నారు. అవసరమైతే హోదా కోసం కేంద్రం మెడలు వంచుతాం అన్నారు.