ఓటీఎస్ అమలు చట్ట విరుద్దమన్నారు టీడీపీ నేత, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. చట్ట ప్రకారం ఇప్పటికే హక్కులు సంక్రమించిన ఇళ్లకూ ఓటీఎస్ అమలు చేసి దోచుకుంటున్నారని యనమల మండిపడ్డారు. అప్పులు పుట్టకే ప్రభుత్వం ఓటీఎస్ పేరుతో నాటకం ఆడుతోంది. లిమిటేషన్ యాక్ట్ ప్రకారం పేదల ఇళ్లకు 12 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు వస్తాయి. వాస్తవాలను మరుగునపెట్టి సెటిల్ మెంట్ చేస్తామనడం పేదప్రజలను మోసగించడమే.ఓటిఎస్ పేరుతో పేదల నుంచి రూ.5 వేల కోట్లు దోచుకునేందుకు మాస్టర్ ప్లాన్.ఏడాదికి 5 లక్షల ఇళ్లు కడతామని చెప్పిన జగన్ రెండున్నరేళ్లలో ఒక్క ఇల్లయినా కట్టారా?తాను ఇచ్చిన హామీలకే జగన్ రెడ్డి తూట్లు పొడిచారు.
నివాసయోగ్యం కాని చోట్ల ఇళ్ల స్థలాలు ఇచ్చి రూ. 7వేల కోట్లు దోచుకున్నారు.ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మేం నిర్మించిన 2.62 లక్షల టిడ్కో ఇళ్లు పేదలకు ఇవ్వాలి.టీడీపీ గత ఐదేళ్లలో 10.5 లక్షల ఇళ్లు పేదల కోసం నిర్మించింది.రాజధానిలో మేం కట్టించిన 5 వేల ఇళ్లు పేదలకు ఇవ్వకుండా తప్పుడు ప్రచారం చేస్తారా?కరోనా నేపథ్యంలో పేదలకు రోజు గడవడమే కష్టంగా మారింది.ఈ సమయంలో ఓటీఎస్ పేరుతో బలవంతపు వసూళ్లకు దిగడం దుర్మార్గం.ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పేదల ఇళ్లను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని యనమల డిమాండ్ చేశారు.